వైకుంఠపురం టీంపై కేసు నమోదు

Update: 2020-01-09 05:54 GMT
అల్లు అర్జున్‌ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్‌ గా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన అల వైకుంఠపురంలో చిత్రం సంక్రాంతి కానుకగా ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంను హాసిన అండ్‌ హారిక ప్రొడక్షన్స్‌ లో రాధాకృష్ణ మరియు గీతాఆర్ట్స్‌లో అల్లు అరవింద్‌ లు సంయుక్తంగా నిర్మించిన విషయం తెల్సిందే. అయితే ఇప్పుడు ఈ రెండు నిర్మాణ సంస్థలు మరియు ఇటీవల ఈ చిత్రం మ్యూజికల్‌ నైట్‌ కార్యక్రమంకు నిర్వహించిన శ్రేయాస్‌ మీడియాపై కేసు నమోదు అయ్యింది.

మొన్న అల వైకుంఠపురంలో సినిమా మ్యూజికల్‌ నైట్‌ కార్యక్రమంను యూసుఫ్‌ గూడా పోలీస్‌ లైన్స్‌ లో వైభవంగా నిర్వహించిన విషయం తెల్సిందే. ఈ కార్యక్రమం కోసం పోలీసుల నుండి నిర్మాతలు మరియు కార్యక్రమ నిర్వాహకులు శ్రేయాస్‌ మీడియా వారు అనుమతి తీసుకున్నారు. కాని అనుమతి కోసం చేసుకున్న దరకాస్తు లో కేవలం ఆరు వేల మంది మాత్రమే హాజరు అవుతారని అలాగే రాత్రి 10 గంటల వరకు  ముగించేస్తామంటూ  పేర్కొనడం జరిగింది.

దరకాస్తులో పేర్కొన్నదాని ప్రకారం జనాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు కనుక పోలీసులు అనుమతులు ఇచ్చారట. కాని కార్యక్రమంలో ఆరువేలకు 15 వేల మంది హాజరు అవ్వడంతో పాటు రాత్రి 10 గంటలకు ముగియాల్సింది గంటన్నర అదనంగా 11.30 గంటలకు ముగిసింది దాంతో యూసుఫ్‌ గూడాతో పాటు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్‌ అవ్వడంతో పాటు సామాన్య జనాలు అవస్థలు పడ్డారు. ఈ కారణంగానే పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ కేసుపై చిత్ర యూనిట్‌ సభ్యులు ఎలా స్పందిస్తారో చూడాలి.
Tags:    

Similar News