కొంతకాలం నుంచి శ్రీరెడ్డి చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు మీడియాలో చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. మొన్నటి వరకు తెలుగు సినిమా పరిశ్రమలో కొన్ని సమస్యలపై పోరాడిన శ్రీరెడ్డికి పలువురి నుంచి మద్దతు కూడా దక్కింది. అయితే, ఆ మద్దతు వల్లనో - ఇంకే కారణాల వల్లనో ఆమె సినిమా పరిశ్రమ కష్టాల గురించి డైవర్టై అనేక విషయాలను ప్రస్తావించడం మొదలుపెట్టింది. సంబంధం లేని వ్యక్తులపై ఆరోపణలు చేయడం కూడా మొదలుపెట్టింది. పవన్ కళ్యాణ్ కూడా ఆమె నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. విమర్శల వరకు అయితే అది ఇబ్బంది అయ్యేది కాదు.
తాజాగా పవన్ కళ్యాణ్‌ను ఆయన మాతృమూర్తిని శ్రీరెడ్డి అసభ్యకర పద జాలంతో ఆమె విమర్శించింది. దీంతో ఆమెపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ఆగ్రహంగా ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమెకు పవన్ ఫ్యాన్స్ ఆగ్రహంతో ఘాటు కౌంటర్లు ఇచ్చారు. పవన్ పై కుట్రలు చేసినట్లు అనిపిస్తోందని అన్నారు. మరోవైపు నితిన్ - వరుణ్ తదితరులు కూడా ఎవరో కొన్ని పనికిమాలిన విమర్శలు చేసినంత మాత్రాన ఆయన గొప్పతనం సమసిపోదు అన్నట్లు వ్యాఖ్యానించారు. అన్ని వైపుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో శ్రీరెడ్డి సంజాయిషీ ఇస్తూ... పవన్ తల్లిని అన్నందుకు సారీ... కానీ పవన్ పైన - పవన్ ఫ్యాన్స్ పైన నా మాటలు వెనక్కుతీసుకోను అన్నది. ఒక పార్టీ అధ్యక్షుడు, సంఘంలో పరువు గల మా హీరోపై అనుచిత వ్యాఖ్యలు చేస్తావా అంటూ జనసేన కార్యకర్తలు అమెపై తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. పవన్ కల్యాణ్ పై, ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలంటూ ‘జనసేన’ కార్యకర్తలు పోలీసులను ఫిర్యాదులో కోరారు.