'పుష్ప' కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసు..!

Update: 2022-04-01 07:30 GMT
ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య టాలీవుడ్ కు కూడా సుపరిచితమే. తెలుగులో 'డీజే' సినిమాలో 'గుడిలో బడిలో' పాటకు డ్యాన్స్ కంపోజ్ చేసింది ఆయనే. ఈ మధ్య కాలంలో ఒక ఊపు ఊపేసిన 'పుష్ప' సినిమాలో 'ఊ అంటావా' పాటకు స్టెప్పులు వేయించింది కూడా ఆచార్యనే. అయితే ఇప్పుడు గణేశ్ ఆచార్య లైగింక వేధింపుల కేసుతో వార్తల్లో నిలిచారు.

నివేదికల ప్రకారం.. గణేశ్ ఆచార్య వద్ద అసిస్టెంట్ గా పని చేసిన ఓ మహిళా కొరియోగ్రాఫర్.. తనని లైగింక వేధించడంటూ 2020లో కేసు నమోదు చేసింది.

ఆయనపై లైంగిక వేధింపులతో పాటు అశ్లీల వీడియోలు చూపించడం.. అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడని.. వెంబడించడం వంటి ఆరోపణలు చేసింది. ఈ కేసు ముంబైలోని ఓషివారా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది. అయితే కేసు విచారణ తర్వాత తాజాగా కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేయబడింది.

గణేష్ ఆచార్య పై అంథేరీలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ దాఖలు చేయబడిన ఛార్జ్ షీట్ వివరాలు పోలీసు అధికారి సందీప్ షిండే వెల్లడించారు. గణేశ్ తో పాటు అతని సహాయకుడిపై 354-ఎ (లైంగిక వేధింపులు) - 354-సి (వోయూరిజం) - 354-డి (వెంబడించడం) - 509 (మహిళను అవమానించడం) - 323 (బాధ కలిగించడం) - 504 (శాంతి భంగం కలిగించే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా అవమానించడం) - 506 (నేరపూరిత బెదిరింపు) సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు.

2019 మే నెలలో శృంగారంలో పాల్గొనాలని గణేశ్ ఆచార్య తనని బలవంతం చేశాడని మహిళా కొరియోగ్రాఫర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే తన అసిస్టెంట్స్ దుర్భాషలాడారని.. వారితో తనపై దాడి చేయించినట్లు ఆమె తెలిపారు. దీంతో నాన్ కాగ్నిసబుల్ కేసు పెట్టానని.. ఈ విషయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు నేను న్యాయవాదిని సంప్రదించానని తెలిపింది.

ఈ కేసు విషయం తెలిసిన వెంటనే గణేశ్ ఆ లేడి కొరియోగ్రాఫర్ పై పరువు నష్టం దావా వేశాడు. తాజా పరిణామాలపై స్పందించడానికి గణేష్ ఆచార్య నిరాకరించారు. అయితే ఎఫ్ఐఆర్ లోని అన్ని సెక్షన్లు బెయిలబుల్ అని అతని తరపు న్యాయవాది రవి సూర్యవంశీ అన్నారు.
Tags:    

Similar News