ప్రముఖ సెలబ్రిటీ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, హీరోయిన్ తమన్నాలకు భారీ షాక్ ఇచ్చాడు ఓ న్యాయవాది. వారిద్దరిని అరెస్ట్ చేయాలంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసాడు. కోహ్లీ, తమన్నా ఇద్దరు కలిసి యువతను పెడదారి పట్టిస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నాడు. మరి ఆ న్యాయవాది అసలు ఎందుకు కోర్టులో పిటిషన్ దాఖలు చేసాడంటే.. చెన్నైకి చెందిన ఓ న్యాయవాది ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్(జూదం) ఆటను కోహ్లీ, తమన్నా ప్రోత్సహిస్తున్నారని అన్నాడు. అదెలా అంటే.. వీరిద్దరూ గ్యాంబ్లింగ్ ప్రోత్సహించే ప్రకటనల్లో నటిస్తూ యువతను దారి మళ్లిస్తున్నారని సదరు న్యాయవాది తెలిపాడు. ఇప్పటికే ఆన్‌లైన్ యాప్స్ తో యూత్ చెడిపోతుంటే.. వాటిని బ్యాన్ చేయాలనీ చెప్పడం మానేసి.. గ్యాంబ్లింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నందుకు కోహ్లి, తమన్నాలను అరెస్టు చేయాలని కోరుతున్నాడు.
ఈరోజుల్లో ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ వలన యువత ఆత్మహత్యలకు పాల్పడే ప్రయత్నాలు చేస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నాడు. అలాగే ఓ ఉదాహరణ కూడా తెలిపాడు. ఓ యువకుడు ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ కోసం అప్పులు చేసి తిరిగి చెల్లించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఈ మధ్యకాలంలో తమ రాష్ట్రము తమిళనాడులో ఈ తరహా సూసైడ్ ఇష్యూలు ఎక్కువైనట్లు న్యాయవాది వెల్లడించాడు. అలాగే ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌కి అలవాటుపడి అధిక వడ్డీలకు అప్పులు తీసుకుని, తిరిగి చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న యువకుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. అంతేగాక ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌ని న్యాయవాది బ్లూ వేల్ గేమ్ అని పోల్చాడు. అందుకే ఎంతోమంది చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసాడు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం దీనిపై వచ్చే మంగళవారం విచారణ జరపనుందట. మరి ఈ పిటిషన్ పై కోర్టు ఎలా స్పందించనుంది? కోహ్లీ, తమన్నాలు ఏమంటారు? అనేది ఆసక్తి రేపుతోంది.