ఈపాటికి ‘జనతా గ్యారేజ్’ మేనియా మొదలైపోవాల్సింది. విడుదలకు సన్నాహాలు జరుగుతుండాల్సింది. కానీ ఆగస్టు 12 నుంచి సెప్టెంబరు 2కు సినిమా వాయిదా పడిపోవడంతో సినిమా వార్తల్లో లేకుండా పోయింది. ఇంకా కొన్ని రోజులు షూటిగ్ పెండింగులో ఉన్నందువల్లే సినిమాను వాయిదా వేసినట్లు దర్శకుడు కొరటాల శివ చెప్పిన సంగతి తెలిసిందే. ఆశ్చర్యకరంగా ఈ టైంలో ‘జనతా గ్యారేజ్’ కోసం కాస్టింగ్ కాల్ ఇచ్చారు.
18-25 ఏళ్ల మధ్య వయసున్న ఇద్దరు అబ్బాయిలు.. ఓ అమ్మాయి.. హీరో-హీరోయిన్ల స్నేహితులుగా కనిపించాల్సి ఉంటుందని.. ఇందుకోసం ఆసక్తి ఉన్నవాళ్లు సంప్రదించాలని ‘జనతా గ్యారేజ్’ టీం కాస్టింగ్ కాల్ ఇచ్చింది. ఐతే ఇది మలయాళ వెర్షన్ కోసం కావడం విశేషం. అంటే తెలగులో ఇప్పటికే పూర్తి చేసిన కొన్ని సన్నివేశాల్ని మలయాళం కోసం ప్రత్యేకంగా తీస్తున్నారన్నమాట.
ఇప్పటికే మోహన్ లాల్.. నిత్యామీనన్.. ఉన్ని ముకుందన్ లాంటి మలయాళ ఆర్టిస్టులతో ఈ సినిమాకు మల్లూ టచ్ బాగానే ఇచ్చారు. ఓ స్ట్రెయిట్ మలయాళ సినిమా లాగే ఇది కూడా కేరళలో భారీగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మరింత కేర్ తీసుకుని మలయాళం డోస్ మరింత పెంచడానికి కొరటాల ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. ఈ కొత్తగా ఎంపికైన వాళ్లతో ఆగస్టు 1-10 మధ్య షూటింగ్ జరుగుతుందని కూడా ఇందులో పేర్కొన్నారు. అంటే ఆ షెడ్యూల్ తో షూటింగ్ ముగిసిపోతుందన్నమాట.