ఆమె పెట్టే డబ్బుతో విల్లా కట్టొచ్చు

Update: 2018-02-09 18:30 GMT
కొంత మంది తారలు చూడటానికి సింపుల్ గా ఉన్నప్పటికీ రియల్ లైఫ్ లో చాలా రిచ్ ని మెయింటెన్ చేస్తారు. అలాంటి తారలు మన పరిశ్రమలో చాలా మందే ఉన్నారు. ఇక హీరోయిన్స్ కూడా దాదాపు అలాంటి లైఫ్ కె ఎక్కువగా ఇష్టపడతారు. అలాంటి వారిలో క్యాథెరిన్ ట్రెసా కూడా ఉంది. పైసా సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన హాట్ బ్యూటీ డబ్బును మంచి నీళ్లలా కార్చుపెట్టేస్తుందట. తనను తాను ఏ మాత్రం తక్కువగా చూసుకోదని తెలుస్తోంది.

రీసెంట్ గా ఆమె సన్నిహితుల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం క్యాథెరిన్ ఇటీవల హైదరాబాద్ లో ఒక మంచి ఇల్లును సెట్ చేసుకుందట. అయితే ఆమె ఇంటి ఇంటేరియర్ కోసం డబ్బును ఖర్చు పెట్టిన విషయం తెలిస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందేనట. క్యాథెరిన్ ట్రెసా ఎంతగా ఖర్చుపెట్టిందంటే..దానికి ఈక్వల్ గా ఒక లగ్జరీ విల్లాను కట్టేసుకోవచ్చట. ఆ స్థాయిలో అమ్మడు డబ్బును వాడుతుందట. క్యాథెరిన్ సినిమాలతోనే కాకుండా బిజినెస్ లలో కూడా డబ్బును ఇన్వెస్ట్ చేసి బాగానే సంపాదిస్తుందట. ఆమెకు కొన్ని వ్యాపారాలు ఉన్నట్లు టాక్.

ఇక సరైనోడు సినిమా తరువాత పైసా బ్యూటీ మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికి ఎక్కువగా స్టార్ హీరోయిన్ లెవెల్లో అవకాశాలను అందుకోవడం లేదు. ప్రస్తుతం ఫిట్ నెస్ వర్క్స్ తో అమ్మడు  అందంలో కొన్ని మార్పులు చేస్తోందట. ఇక గత కొంత కాలంగా నిఖిల్ సినిమాలో క్యాథెరిన్ నటించడానికి రెడీగా ఉందని వార్తలు వస్తున్నాయి. కానీ అది నిజం కాదు. నిఖిల్ కొంచెం తనకు సెట్ అయ్యే కుర్ర హీరోయిన్స్ కోసం ఎదురుచూస్తున్నాడు.


Tags:    

Similar News