బడాయిలు పోవడానికి ఎపుడైనా రైట్ టైమే. కానీ సంపాదించుకోవడానికి మాత్రం వయసు మీదున్నపుడే జాగ్రత్త పడాలి. లేకపోతే టాలెంట్-అందం ఎడారిలో వెన్నెల అయిపోతాయి. ఈ విషయాన్ని కాస్త ఫాస్ట్‌గా పట్టేసిన భామ క్యాథరిన్ త్రెసా. ఇద్దరమ్మాయిలతో సినిమా మినహా తను సింగిల్ గా స్క్రీన్ మీద కనపడిన ఏ సినిమాలోనూ జనాల దృష్టిని పెద్దగా క్యాచ్ లేకపోయిందీ భామ. ఇక 2015లో వచ్చిన రుద్రమదేవితో తన రూటు మార్చుకుంది.
ప్రయారిటీగా కనిపించే రోల్ అయితే చాలు.. అది లీడ్ రోల్ కాకపోయినా పర్లేదని ఫిక్సయింది. అలా కనుక చేయకపోతే ఇండస్ట్రీ తనను మరిచిపోయే ప్రమాదముందని కూడా కనిపెట్టేసింది. అంతే ఎడా పెడా సెకండ్ రోల్స్ కు ఓకే చెప్పేస్తూ వచ్చింది. క్లిక్ అయితే రోల్ - మనీ... లేకపోతే మనీ ఏదో ఒక్కటి వర్కవుటం ఖాయం. ఒకవేళ దశ తిరిగితే మళ్లీ లీడ్ రోల్స్ రావచ్చు. లేదా సెకండ్ రోలే జనానికి నచ్చొచ్చు... అన్న సూత్రంతో చకచకా సినిమాలకు సైన్లు చేసేస్తోంది.
నిజంగానే సరైనోడులో లీడ్ రోల్ కాకపోయినా జనాలకు ఆమె బాగానే ఎక్కింది. ఇపుడు అస్సలు ఖాళీగా లేదీ భామ. పైగా రోల్ డిమాండ్ చేసినట్టు రెడీ అంటోంది. తాజాగా గౌతమ్ నందలో బికినీ వేసి - దమ్ము కొట్టి తన టాలెంట్ చూపించింది. ఎవరైనా అడిగితే చెప్పడానికి ఒక ఆన్సర్ కూడా రెడీ చేసుకుంది. ఫస్టా - సెకండా అన్నది కాదు క్యారెక్టర్ ఏంటి, సినిమాలో దాని ఇంపార్టెన్స్ ఎంత అన్నదే నాకు ముఖ్యం. సరైనోడులో చూశారుగా... ఎలా ఉందో నా క్యారెక్టర్ అంటూ ఒక ఎగ్జాంపుల్ తో కొట్టింది. తాజాగా నేనే రాజు నేనే మంత్రి - జయ జానకీ నాయక రెండు సినిమాల్లోనూ కనిపించిన విషయం గుర్తించారుగా.