సినిమా ఇండస్ట్రీకి సెన్సార్ బోర్డు చీఫ్ పహ్లజ్ నిహ్లానీ షాక్ ఇచ్చారు. సినిమా సెన్సార్ కట్ ల విషయంలో ఇప్పటికే పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న ఆయన తాజాగా మరో సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు. ఇకపై సినిమాల్లో హీరోలు పొగ తాగతూ, మద్యం సేవిస్తున్నట్లు నటించే సీన్లను చూపించకూడదని ప్రకటించి కలకలం రేపారు. ఒక వేళ అటువంటి సన్నివేశాలు ప్రదర్శించాలంటే ఆ సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్ ఇస్తామని తెలిపారు.
పహ్లజ్ నిహ్లానీ తీరుపై పలువురు సెలబ్రెటీలు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘అమర్త్యసేన్’ చిత్రంలో ‘ఆవు’ - ‘గుజరాత్’ అన్న పదాలు వాడకూడదని చెప్పడంతో ఆయన పేరు ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. సినిమాల్లో దమ్ము కొడుతూ, మందు తాగుతూ నటించే సన్నివేశాలు చూపించకూడదని ప్రకటించి మరో సంచలనానికి తెర తీశారు.
సినిమా మొదలయ్యే ముందు ‘ పొగ తాగడం - మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం’ అని డిస్ క్లైమర్ వేస్తే సరిపోదని ఆయన అన్నారు. స్క్రీన్ కు ఎక్కడో ఒక మూల.... పొగతాగడం ఆరోగ్యానికి హానికరం అని చూపించేస్తే సరిపోదని ఆయన అభిప్రాయపడ్డారు. హీరోలకు కోట్లమంది అభిమానులు ఉంటారని, తమ హీరోలను అనుకరించాలని ఫ్యాన్స్ ప్రయత్నిస్తుంటారని అన్నారు. ఒకవేళ తప్పని సరిగా ఆ సన్నివేశాలు చూపించాల్సి వస్తే వాటికి ‘ఏ’ సర్టిఫికెట్ ఇస్తామని నిహ్లానీ మీడియా ద్వారా వెల్లడించారు.