విలక్షణమైన పాత్రలతో విభిన్నమైన చిత్రాల్లో నటిస్తూ హీరోగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు హీరో ఆది పినిశెట్టి. ఓ పక్క హీరోగా కొనసాగుతూనే క్యారెక్టర్ డిమాండ్ ని బట్టి విలన్ గానూ నటిస్తూ తనదైన ప్రత్యేకతని చాటుకుంటున్నారాయన.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన `సరైనోడు` చిత్రంలో వైరమ్ ధనుష్ గా నటించిన ఆ పాత్రలో తనదైన మార్కు విలనిజాన్ని పలికించి శభాష్ అనిపించుకున్నారు యంగ్ హీరో ఆది పినిశెట్టి. ఆ తరువాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన `అజ్ఞాతవాసి` చిత్రంలోనూ యంగ్ విలన్ గా నటించి ఆకట్టుకున్నారు.
ఆది ప్రస్తుతం మరో తెలుగు చిత్రంలో విలన్ గా కనిపించబోతున్నారు. రామ్ హీరోగా నటిస్తున్న `దాఇ వారియర్` మూవీలో ఆది పినిశెట్టి గురు అను పాత్రలో ప్రధాన విలన్ గా పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. యాక్షన్ చిత్రాల దర్శకుడు ఎన్. లింగు స్వామి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.
కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. ఇదిలా వుంటే ఆది పినిశెట్టి హీరోగా నటించిన చిత్రంపై ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తుండటం ఆసక్తికరంగా మారింది.
ఆది పినిశెట్టి హీరోగా నటించిన తాజా చిత్రం `క్లాప్`. ఇదొక ద్వి భాషా చిత్రం. తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో నిర్మించిన ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్ సోలీలివ్ లో రిలీజ్ చేస్తున్నారు. శుక్రవారం నుంచి ఈ మూవీ సోనిలివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని పృథ్వీ ఆదిత్య రూపొందించారు.
ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా నటించింది. ఐ.బి. కార్తికేయన్ తమిళంలో నిర్మించిన ఈ చిత్ర తెలుగు వెర్షన్ కి రామాంజనేయులు జవ్వాజి, ఎం. రాజశేఖర్ రెడ్డి నిర్మాతలు.
శుక్రవారం సోని లివ్ లో స్ట్రీమింగ్ కానున్న సందర్భంగా చిత్ర బృందం గురువారం రాత్రి ఈ మూవీ ప్రీమియర్ షోని ఏర్పాటు చేశారు. ఈ షోని ప్రత్యేకంగా వీక్షించిన వారిలో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ, ఆది పినిశెట్టి, హీరో నేచురల్ స్టార్ నాని, ఆకాంక్ష సింగ్, ప్రగతి, నవీన్ చంద్ర, డైరెక్టర్ బుచ్చిబాబు సాన, సి. కల్యాణ్ తదితర సెలబ్రిటీలున్నారు. సినిమా చూసిన చాలా మంది సెలబ్రిటీలు ఆది పినిశెట్టిపై, సినిమాపై ప్రశంసలు కురిపించారు.
ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా నిజాయితీగా తీసిన చిత్రమిదని, ఇందులో నేను, ఆకాంక్ష సింగ్ ఇద్దరం స్పోర్ట్స్ పర్సన్స్ గానే కనిపిస్తాం. మా ఇద్దరి ప్రయాణం మరొకరి భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దిందన్నదే ఈ చిత్ర ప్రధాన కథాంశం.
ఇళయరాజా రీ రికార్డింగ్ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుందని హీరో ఆది పినిశెట్టి ఈ సందర్భంగా తెలియజేశారు. ఇలాంటి చిత్రంలో నటించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని హీరోయిన్ ఆకాంక్ష సింగ్ తెలిపింది.