శివసేన వ్యవస్థాపక అధ్యక్షుడు బాల్ థాక్రే జీవితకథ ఆధారంగా తెరకెక్కిన `థాక్రే` నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రిలీజైంది. కంగన `మణికర్ణిక`తో పోటీపడుతూ ఈ చిత్రం థియేటర్లను షేర్ చేసుకుంది. థాక్రే చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖి టైటిల్ పాత్ర పోషించారు. థాక్రే భార్యామణి పాత్రలో అమృతరావు నటించారు. సంజయ్ రౌత్ కథ అందించగా, అభిజిత్ ఫాన్సే దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఓపెనింగ్ డే టాక్ ఎలా ఉంది? ఇండస్ట్రీ వర్గాలు ఏమంటున్నాయి? అంటే ఇదిగో ఇదే సమాధానం.
థాక్రే సినిమాని వీక్షించిన పలువురు సినీసెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ప్రివ్యూ వీక్షించిన అనంతరం ట్విట్టర్ లో తమ అభిప్రాయాల్ని షేర్ చేసుకున్నారు. భాజపా నాయకుడు .. షాట్ గన్ శత్రుఘ్న సిన్హా మాట్లాడుతూ.. ``థాక్రే బయోపిక్ ని సుర్జీత్ చక్కగా తెరకెక్కించారు. ముఖ్యంగా బాలా సాహెబ్ థాక్రే పాత్రలో నవాజుద్దీన్ సిద్ధిఖి గొప్పగా అభినయించారు. ఆయన ఆ పాత్రకు పూర్తిగా న్యాయం చేశారని ప్రశంసించారు. దివంగతులైన బాల్ థాక్రే పాత్రకు నమ్మశక్యమైన నటుడిని ఎంపిక చేశారు`` అంటూ పొగిడేశారు.
మరో సెలబ్రిటీ సుర్జీత్ సిర్కార్ మాట్లాడుతూ-``ఈ సినిమా బోల్డ్ & పవర్ ఫుల్. ఒక ఆర్టిస్టు పవర్ ఫుల్ లీడర్ గా ఎలా ఎదిగారు? అన్న కథ ఆకట్టుకుంది. దేశంలోనే ఒక చక్కని నటుడు నవాజుద్దీన్. టైగర్ లా గర్జించాడు. టీమ్ కి శుభాకాంక్షలు`` అని ట్వీట్ చేశారు. స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఈ సినిమా ప్రివ్యూని వీక్షించిన అనంతరం చక్కని బయోపిక్ ఇదని ప్రశంసించారు. ఇక థాక్రే చిత్రం ఓపెనింగ్ డే 3-4 కోట్లు వసూలు చేస్తోందని ట్రేడ్ చెబుతోంది. నటుడిగా నవాజుద్దీన్ కి అసాధారణ ఫాలోయింగ్ ఉంది. థాక్రేకి ఉత్తరాదిన గొప్ప ఫాలోయింగ్ ఉంది. మరాఠా దేశంలోనూ చక్కని వసూళ్లు దక్కుతాయి.. బాక్సాఫీస్ ఓపెనింగులకు ఇది కలిసి రానుందని విశ్లేషిస్తున్నారు.