త‌ల‌సాని పిలిస్తే వారంతా వ‌చ్చారు

Update: 2016-11-14 06:24 GMT
పార్టీ ఏదైనా దూకుడు రాజ‌కీయాల‌కు పెట్టింది పేర‌యిన సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ‌ స‌భ్యుడు త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ మరోమారు త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు. టీడీపీ త‌ర‌ఫున ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్ ఎస్ స‌ర్కారులో మంత్రిగా ఉన్న త‌ల‌సాని త‌న ఇంట్లో శుభ‌కార్యానికి మీడియా మొఘ‌ల్ రామోజీ రావుతో సినీ దిగ్గ‌జాల‌ను సైతం ఆసీనులు అయ్యేలా చేయ‌గ‌లిగారు. సినిమాటోగ్ర‌ఫీ మంత్రిగా ఉన్న త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ కూతురు స్వాతి వివాహం ఇటీవ‌ల జ‌రిగింది. తాజాగా ఈ వివాహ  రిసెప్ష‌న్‌ ను హైద‌రాబాద్‌ లోని నోవాటెల్ హోట‌ల్‌ లో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ వేడుక‌కు ఇండ‌స్ట్రీ దిగ్గ‌జాలు హాజ‌ర‌య్యారు.

అగ్ర‌న‌టులైన నంద‌మూరి బాల‌కృష్ణ‌ - ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - ప్రిన్స్ మ‌హేశ్ బాబు - స‌హా అఖిల్ అక్కినేని - గోపిచంద్‌ - మంచు విష్ణు - బ్ర‌హ్మానందం - వెట‌ర‌న్ న‌టులు నంద‌మూరి హ‌రికృష్ణ‌ - కృష్ణం రాజు - మా అధ్య‌క్షుడు రాజేంద్ర‌ప్ర‌సాద్ తో పాటు పెద్ద ఎత్తున సినీ వ‌ర్గాలు హాజ‌ర‌య్యారు. ఈనాడు సంస్థ‌ల అధిప‌తి రామోజీ రావు త‌ల‌సాని కుమార్తె వివాహానికి విచ్చేశారు. ఈ ప‌రిణామంతో ప్ర‌భుత్వంలో త‌న ప‌ట్టును, సినీ వ‌ర్గాల‌తో త‌న‌కున్న సంబంధాల‌ను త‌ల‌సాని చాటుకున్న‌ట్లు అయింద‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News