బాలీవుడ్ లో నవతరం కథానాయికల హవా సాగుతోంది. సోనాక్షి సిన్హా - సోనమ్ కపూర్ - ఆలియాభట్ - శ్రద్ధాకపూర్ - శ్రుతిహాసన్ - అక్షర హాసన్ ఇంతమంది నటవారసులు పరిశ్రమలో అడుగుపెట్టారు. అయితే వీళ్లెవరికీ లాంచ్ ప్యాడ్ కోసం తండ్రులు సహకరించలేదు. శత్రుఘ్న సిన్హా - అనీల్ కపూర్ - కమల్ హాసన్ ఇంత పెద్ద దిగ్గజాలు అయినా కూతుళ్లను హీరోయిన్లుగా ప్రమోట్ చేయడం కోసం ప్రత్యేకించి పరితపించలేదు. సొంత బ్యానర్ల లో పరిచయం చేసి, పెద్ద స్టార్లను చేయాలని అనుకోలేదు. బిడ్డలకు కావాల్సిన స్వేచ్ఛనిచ్చారు. ఇండివిడ్యువల్ గానే ఇండస్ట్రీలో అవకాశాలు వెతుక్కుని రాణించాలని ప్రోత్సహించారు తప్ప, డబ్బు లున్నాయ్ మనకేంటి? అని గర్వాన్ని చూపించలేదు. అందుకే నటవారసులుగా కెరీర్ ప్రారంభించినా తమకంటూ ఓ ప్రత్యేకత ఉందని నిరూపించుకోవడానికి ఈ భామలంతా ఎంతో శ్రమించాల్సొచ్చింది.
సోనాక్షి కి సల్మాన్ అవకాశాలిచ్చి ప్రోత్సహించాడు. ఆ తర్వాత తనే స్వయంగా ఎదిగేసింది. సొంత బ్యానర్ లో సినిమా తీసే అవకాశం ఉన్నా అనీల్ కపూర్ ఆ పని చేయలేదు. సోనమ్ ని వేరొక సంస్థలోనే పరిచయం చేశాడు. అలాగే తన సినిమాల ప్రమోషన్ కి తనే ప్లాన్స్ రెడీ చేసుకుంటుంది. ఆలియా, శ్రద్ధాకపూర్ సైతం ఆరంగేట్రం కోసం తండ్రులపై ఆధారపడలేదని చెబుతారు. ఇక కమల్ హాసన్ సైతం సొంత బ్యానర్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ పై కూతుళ్ల కోసం సినిమాలు తీయలేదు. శ్రుతిహాసన్ తనంతట తానుగానే వెండితెరకి పరిచయం అయ్యింది. బాలీవుడ్ లో లక్ సినిమా తో లక్ చెక్ చేసుకుంది. టాలీవుడ్ లో అనగనగా ఓ ధీరుడు చిత్రంతో తెరంగేట్రం చేసింది. ఇవి రెండూ బైటి బ్యానర్లే. ఇటీవలే షమితాబ్ చిత్రంతో అక్షర కెరీర్ ప్రారంభించింది. దానికి కమల్ రికమండేషన్ లేనేలేదు.
సీనియర్ నటి రవీనాటాండన్ తండ్రి రవి టాండన్ ఓ నిర్మాత. తండ్రి అవకాశం ఇస్తానని అన్నా జి.పి.సిప్పి నిర్మాతగా తెరకు పరిచయం అయ్యింది. సొంత బ్యానర్ ఆర్.కె.ఫిలింస్ అండదండలు ఉన్నా కరిష్మా కపూర్ వేరొక బ్యానర్ లోనే నాయిక అయ్యింది. ప్రమే ఖైదీ చిత్రంతో తెరకి పరిచయం అయ్యింది. జె.పి.దత్తా బ్యానర్ లో రెఫ్యూజీ చిత్రంతో కరీనా తెరకి పరిచయం అయ్యింది. రాహుల్ రావల్ 'బేకురి' చిత్రంతో కాజోల్ తెరకి పరిచయం అయ్యింది. సొంత బ్యానర్ ఉన్నా.. పట్టించుకోలేదు. ఆలియా .. భట్స్ ని కాదని కరణ్ జోహర్ నిర్మాణంలోని 'స్టూడెంట్ నంబర్ 1' చిత్రంలో నటించింది.