పాత బడిన చినుగుల ఫ్యాంటు, నలిగిపోయిన బనియన్ వేసుకుని జిమ్ముకెళ్లే రోజులు పోయాయి. ఇప్పుడంతా మోడ్రన్ ట్రెండ్. జిమ్ము డ్రెస్సుల్లోనూ స్టయిల్ కావాలి. బ్రాండెడ్ కావాలి. నైక్, రీబాక్ లాంటి ఖరీదైన డ్రెస్సులు కావాల్సిందే. అంత కాస్ట్‌లీగా కనిపించకపోతే జిమ్ములు చేయలేమా అంటే కుదరదనే చెబుతున్నారు యువతరం.
నవతరం తారల్లో రెగ్యులర్ గా జిమ్మింగ్ చేసే కొందరిని ఇదే ప్రశ్న వేస్తే ఏం సమాధానమిచ్చారో తెలుసా? జిమ్ములో చుట్టూ అద్దాలు అమర్చి ఉంటాయి. మనం ఏం చేసినా అందులో కనిపిస్తుంది. మన శరీరాకృతి ఎలా ఉంటుందో అందులో చూసుకున్నప్పుడు కొత్త ఉత్సాహం వస్తుంది. ఆకృతిలో డెవలప్ మెంట్ ఏం ఉందో చూసుకోవచ్చు. అలాంటప్పుడు మనం తొడుక్కునే డ్రెస్సులు కూడా అంతే లుక్ నిచ్చేవిగా ఉండాలని చెబుతున్నారు. ఖరీదైన బ్రాండెడ్ దుస్తులు అయితే కావాల్సినంత ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. స్పోర్ట్స్ వేర్ నాణ్యత పూర్తిగా వేరుగా ఉంటుందని చెప్పుకొచ్చారు.
టాలీవుడ్ లో రకూల్ ప్రీత్‌సింగ్, రామ్‌చరణ్, బన్ని, రానా, ప్రభాస్, అనుష్క, తమన్నా ఇలా స్టార్లంతా.. రెగ్యులర్ గా జిమ్ముల్లో కుస్తీలు పడుతూనే ఉంటారు. జిమ్ము కోసం ప్రత్యేకమైన వేషధారణలో సిద్ధమై వెళతారు. టాంక్ టాప్స్, రేసర్ బ్యాక్ వంటి డిజైనర్ డ్రెస్సుల్లో కనిపిస్తారు. బాలీవుడ్ లో బిపాసాబసు, కంగన రనౌత్, ప్రియాంక చోప్రా, పరిణీతి చోప్రా (ఇటీవలి కాలంలో).. ఇలాంటి నాయికలంతా వేకువఝామునే జిమ్మాయనమ: అనకుండా ఉండలేరు. అదీ సంగతి.