బ్రహ్మోత్సవం: ఎవరేమన్నారంటే... 1

Update: 2016-05-07 16:26 GMT
''బ్రహ్మోత్సవం'' సినిమా ఆడియో లాంచ్‌ లో భాగంగా.. చాలా మంది దిగ్గజాలు.. హీరోయిన్లు.. విలక్షణ నటులు.. చాలా మాటలే చెప్పారు. వారు ఏమన్నారో చూద్దాం పదండి.

''తిరుపతి లో బ్రహ్మోత్సవం జరుగుతుంది. ఇక్కడ మహేష్‌ బ్రహ్మోత్సవం జరుగుతోంది. అభిమానులందరూ ఖచ్చితంగా మహేష్‌ బ్రహ్మోత్సవంపై కాసుల వర్షం కురిపిస్తారని ఆశిస్తున్నాను'' అన్నాడు సుధీర్‌ బాబు.

''జీవితమంటేనే ఒక ఉత్సవం. నాకు జీవితం మీద ఏదైతే నమ్మకాలు ఉన్నాయో.. ఈ సినిమాలో సేమ్‌ అలాంటి పాత్రే. అందుకే సినిమా ఆఫర్‌ చేసిన వెంటనే ఒప్పుకున్నాను'' అని చెప్పింది కాజల్‌. ఎర్ర చీరలో దగదగా మెరిసిపోయిన ఈ హాట్‌ లేడీ.. ప్రత్యేకించి ఎవ్వరి యాక్టింగ్‌ గురించి ఏమీ చెప్పలేదు కాని.. ఈ సినిమా చేయడం తన లక్‌ అని చెప్పుకొచ్చింది.

''ఒక నటిగా ఎన్నో ఎమోషనల్‌ అండ్ పవర్ ఫుల్‌ రోల్స్‌ చేసినా కూడా.. ఈ బ్రహ్మోత్సవం క్లయ్‌ మ్యాక్స్ లో మహేష్‌ బాబు యాక్టింగ్‌ చూశాక కళ్ళెమ్మట నీళ్ళు వచ్చేశాయ్'' అన్నారు విలక్షణ నటి జయసుధ. ఈ చిత్రంలో ఛాన్సు ఇచ్చినందుకు.. వరుసగా 3 సినిమాల్లో తనకు ఛాన్సిచ్చినందుకు దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాలకు కూడా థ్యాంక్‌ చెప్పారు ఆమె.

''సినిమా రిజల్టు ఏదైనా కూడా అందులో బాధ్యత నాక్కూడ ఉంటుంది అని మహేష్‌ చెప్పారంటే అది మామూలు విషయం కాదు. మనస్సు నుండి వచ్చిన మాట. ఆ మాటతో నేను ఆయన ఎడ్మయిరర్‌ అయిపోయాను. ఒక సూపర్‌ స్టార్‌ ఇలాంటి సినిమాలే చేయాలని ఒక గీత గీస్తే.. మీరు ఆ గీత దాటి ఇంకో గీత గీస్తారు. అదే అద్భుతం'' అంటూ పొగిడాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. బ్రహ్మోత్సవంలో చెప్పు తొడిగే పోస్టర్ రిలీజ్‌ చేయాలంటే చాలా గట్స్‌ ఉండాలని చెప్పుకొచ్చాడు.

''ఇండస్ర్టీలో ఒక్కడు. మొదటి అడుగు కొత్తగా వేయాలంటే ఒక్కడు. ఆ శ్రీమంతుడి బ్రహ్మోత్సవం ఇది. తనతో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఫెంటాస్టిక్‌ యాక్టర్‌ మాత్రమే కాదు.. తను చాలా పర్ఫెక్షనిస్టు కూడా. ప్రతీ షాట్‌ ను కూడా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఇక బ్రహ్మోత్సవం డైరక్ట్ చేయాలంటే అది శ్రీకాంత్‌ అడ్డాల అనే చెప్పాలి'' అన్నారు సీనియర్‌ నటుడు నరేష్‌ (విజయనిర్మల తనయుడు).
Tags:    

Similar News