ఇంతకుముందు జులై 1న ‘కబాలి’ పక్కా అన్నారు. కానీ ఆ తేదీకి సినిమా విడుదల కాలేదు. గత కొన్ని రోజులుగా జులై 15న ‘కబాలి’ రిలీజవుతుందని ప్రచారం జరుగుతోంది. తమిళ.. తెలుగు భాషల్లో ఇందుకు తగ్గట్లుగా మిగతా సినిమాల్ని షెడ్యూల్ చేసుకున్నారు. ఐతే అటు ఇటుగా ఇంకో రెండు వారాల సమయమే ఉన్నా.. విడుదల తేదీ సంగతి పక్కాగా చెప్పట్లేదు. రిలీజ్ డేట్ పోస్టర్లు కూడా వదలట్లేదు. దీంతో మళ్లీ డౌట్లు కొడుతున్నాయి. ఐతే తమిళనాట ఈ మధ్య సెన్సార్ బోర్డు తెచ్చిన కొత్త నిబంధన వల్లే ‘కబాలి’ రిలీజ్ డేట్ ప్రకటించట్లేదని సమాచారం. ఓ సినిమాకు సెన్సార్ అవ్వకుండా రిలీజ్ డేట్ ఇవ్వకూడదని అక్కడి సెన్సార్ బోర్డు నిబంధన తెచ్చింది.
ముందు రిలీజ్ డేట్ ఇచ్చేసి.. ఆ తర్వాత సెన్సార్ దగ్గర ఏవైనా ఇబ్బందులు తలెత్తితే రిలీజ్ డేట్ ఇచ్చేశామంటూ నిర్మాతలు ఒత్తిడి తెస్తుండటంతో సెన్సార్ బోర్డు ఈ రకమైన నిబంధన తెచ్చింది. సెన్సార్ అవ్వకుండా రిలీజ్ డేట్ ప్రకటించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. అందుకే మొన్న ‘కబాలి’ తెలుగు ఆడియో విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడిన దర్శకుడు పా రంజిత్ ను రిలీజ్ డేట్ గురించి అడిగినా సమాధానం చెప్పలేదు. సెన్సార్ అవ్వగానే డేట్ అనౌన్స్ చేస్తామని చెప్పాడు. మరోవైపు త్రిష కొత్త సినిమా ‘నాయకి’ రిలీజ్ డేట్ తెలుగు వరకు ప్రకటించినా తమిళంలో మాత్రం అనౌన్స్ చేయకపోవడానికి కూడా ఇదే కారణం. ఇంకో మూణ్నాలుగు రోజుల్లో ‘కబాలి’ తమిళ సెన్సార్ పూర్తి చేసి.. అఫీషియల్ గా రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశముంది.