కిస్సులు, బూతులు ఉంటే క‌ట్టింగేనా?

Update: 2015-11-22 17:30 GMT
హాలీవుడ్ నుంచి మ‌న దేశంలో రిలీజ‌య్యే సినిమాల‌కు సెన్సార్ రూల్స్ ఎలా ఉండాలి? ఈ విష‌యంలో సెన్సార్ అధికారుల‌కు క్లారిటీ ఉందంటారా? అస‌లు ఎలాంటి స‌న్నివేశాల‌కు క‌ట్ చెప్పాలి? ఎలాంటి ముద్దు సీన్ ల‌కు క‌త్తెర వేయాలి? ఎలాంటి బూతు ప‌దాల్ని మ్యూట్ చేయాలి? ఇలాంటి విష‌యాల‌పై ప్ర‌స్తుతం ఇంట్రెస్టింగ్ డిస్క‌ష‌న్ సాగుతోంది. ఇటీవ‌లే రిలీజైన కొన్ని హాలీవుడ్ సినిమాల్లో అస‌లు ఫ్లేవ‌ర్ మిస్స‌య్యేలా ఈ క‌త్తెర ప‌ని చేస్తున్నార‌న్న విమ‌ర్శ‌ల్ని సెంట్ర‌ల్ సెన్సార్ అధికారులు నెత్తిన వేసుకోవాల్సొస్తోంది.

రీసెంటుగానే జేమ్స్‌ బాండ్‌ మూవీ నుంచి ఓ ముద్దు స‌న్నివేశాన్ని పూర్తిగా క‌ట్ చేసేశారు. పైగా ఈ మూవీలో ఓ రెండు బూతు పదాల్ని కూడా మ్యూట్ చేశారు. అయితే వాటికి క‌థ‌లో ఎంతో ప్ర‌యారిటీ ఉంది. ఆ విష‌యం తెలిసినా సెన్సార్ బ్రూట‌ల్‌ గా వ్య‌వ‌హ‌రించి క‌ట్ చేసింది. క‌ట్ చేస్తే థియేట‌ర్ల‌లో సినిమా చూసిన ఆడియెన్ అసంతృప్తితో ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఆ మూవీని ఇంట‌ర్నెట్ నుంచి డౌన్‌ లోడ్ చేసుకుని చూడాల్సొచ్చింది. భార‌తీయ క‌ల్చ‌ర్‌ లో ఎంతో మార్పొచ్చింది. అందుకు త‌గ్గ‌ట్టే ఇప్పుడు సెన్సార్ ప‌రిమితులు కూడా మారాల్సి ఉందంటూ విమ‌ర్శ‌లొస్తున్నాయి.

ఎ రేటింగ్‌ - ఎక్స్ రేటింగ్ డ‌బుల్ ఎక్స్ రేటింగ్ అంటూ రేటింగులైతే ఇస్తున్న‌ప్పుడు ఆ క‌త్తెర‌లు ఎందుకు? అని ప్ర‌శ్నిస్తున్నారు భ‌జ‌రంగి డైరెక్ట‌ర్ క‌బీర్‌ ఖాన్‌. మిస్ ల‌వ్‌ లీ అనే బాలీవుడ్ సినిమాకి ముందుగా సెన్సార్ 157 సెన్సార్ క‌ట్స్ చెప్పింది. చివ‌రికి 4 క‌ట్స్‌ తో స‌రిపెట్టుకోవాల్సొచ్చింది. అలాగే హైద‌ర్ సినిమాకి ఏకంగా 41 క‌ట్స్ అని చెప్పినా ఇంకా చాలా వ‌ర‌కూ త‌గ్గించుకోవాల్సొచ్చింది. అనుష్క శ‌ర్మ ఎన్‌ హెచ్ 10కి ఏకంగా ఏ స‌ర్టిఫికెట్  జారీ చేసేసింది సెన్సార్‌ బోర్డ్‌. బ‌ద్లాపూర్ సినిమాలో యామిగౌత‌మ్ న‌టించిన ఓ సీన్‌ ని పూర్తిగా వాట‌ర్ మార్క్‌ తో మూసేయాల్సొచ్చింది.

సెన్సార్ వ్య‌వ‌హార శైలిపై రామ్‌ గోపాల్ వ‌ర్మ మాట్లాడుతూ అస‌లు క‌ళ్లు లేనివాళ్ల కోసం ఈ సినిమాలు తీయాలేమో? అంటూ సీరియ‌స్‌ గా దెప్పిపొడిచారాయ‌న‌. అయితే సెన్సార్‌ షిప్ అనేది ఓ ప్యానెల్ మెంబ‌ర్స్ మ‌ధ్య న‌డిచేది. ఏ ఒక్క‌రి నిర్ణ‌యంతోనే ఇది చేయ‌రు. అంటూ సెన్సార్ బృందం స‌మాధానం చెబుతోంది. కానీ దీనికి మ‌న ఫిలింమేక‌ర్స్ సంతృప్తి చెంద‌డం లేదు. ఈ అంత‌ర్యుద్ధం ఎప్ప‌టికీ కొన‌సాగుతూ ఉండాల్సిందే.
Tags:    

Similar News