షారుక్ ఖాన్ హీరోగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ పఠాన్. యశ్ రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో దీపిక పదుకొనే హీరోయిన్ గా నటించగా జాన్ అబ్రహం పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక ఇండియన్ రా ఏజెంట్ గా షారుక్ ఖాన్ ఈ మూవీలో పవర్ ఫుల్ పాత్రలో దర్శనమిస్తున్నాడు.
సుదీర్ఘ విరామం తర్వాత షారుఖ్ ఖాన్ ఈ సినిమాతో జనవరి 25న ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాని రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయ్యి సంచలనం క్రియేట్ చేసింది. అంతకంటే ముందుగా ఈ సినిమాలోని సాంగ్స్ ప్రేక్షకులు ముందుకు వచ్చాయి. అందులో బేషారమ్ రంగ్ అంటూ సాగే బీచ్ రొమాంటిక్ సాంగ్ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే.
ఆ సాంగ్ లో హీరోయిన్ దీపిక పదుకొనే కాషాయం రంగు బికినీ ధరించడంపై హిందుత్వ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ముస్లిం సంఘాలు కూడా ఆ పాటలో షారుక్ ఖాన్ దీపిక పదుకొనే ధరించిన కాస్ట్యూమ్స్ పై అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో సినిమాపై బ్యాన్ పఠాన్ అంటూ ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతుంది.
షారుఖ్ ఖాన్ మీద, అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీ మీద ఉన్న వ్యతిరేకతని ఈ ట్యాగ్ ను ట్రెండ్ చేయడం ద్వారా చూపిస్తున్నారు. అయితే ఆ సాంగ్ పై వస్తున్న వ్యతిరేకతపై దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ మాత్రం వెనక్కి తగ్గలేదు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కి వచ్చింది. సెన్సార్ సభ్యులు ఈ సినిమాలో సాంగ్ పై అభ్యంతరం వ్యక్తం చేశారు. బేషారమ్ రంగ్ సాంగ్ లోని క్లోజప్ షాట్స్ అన్నీ కూడా తొలగించాల్సిందే అని చిత్ర యూనిట్ కి స్పష్టంగా తెలియజేసినట్లు తెలుస్తోంది. అభ్యంతరకర సన్నివేశాలను తొలగిస్తేనే సెన్సార్ చేస్తామని స్పష్టం చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని తొలగించడానికి దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ అంగీకరించినట్లు సమాచారం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.