కాజల్ కిస్సును కోసి తీసేశారు

Update: 2016-06-09 07:58 GMT
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ బాలీవుడ్ లో పాగా వేసేందుకు బాగానే ట్రై చేస్తోంది. అందుకే ఇప్పుడు చేసిన దో లఫ్జోం కీ కహానీ చిత్రంలో.. ఓ ఘాటు ముద్దు సీన్ కూడా చేసిందని ఇప్పటికే చెప్పేసుకున్నాం. ఈ ముద్దు విషయంలో వివాదాలు, వివరణలు పూర్తయిపోయి.. ఇప్పుడు సెన్సార్ దగ్గరకు చేరింది.

మన చందమామ ముద్దులు పెట్టడం ఇదే మొదలు అని.. పాపం బాలీవుడ్ సెన్సార్ బోర్డ్ బోర్డ్ మెంబర్లకు తెలీదు కదా. అందుకే ఇంత పెద్ద ముద్దు సీనా అని అబ్జెక్షన్ చేశారట. మరి.. ఏకంగా 18 సెకండ్ల పాటు.. లిప్ లాక్ వేయడమంటే మామూలు విషయం కాదు కదా. అందుకే ఈ లిప్ లాక్ ని తగ్గించాల్సిందేనని పట్టు పట్టడంతో పాటు.. సగానికి సగం లేపేశారట కూడా. దీంతో కాజల్- రణ్ దీప్ హుడాల ముద్దు సీన్ ఇప్పుడు 9 సెకండ్లు మాత్రమే ఉంటుందని దో లఫ్జోం కీ కహానీ ర్శకుడు దీపక్ తిజోరి చెబుతున్నాడు.

అయితే.. ఈ చిత్రానికి విజువల్ కట్ మాత్రం ఇదొక్కటేనట. సినిమాలో కొన్నిసార్లు వినిపించే 'సాలే', 'కుత్తే' పదాలను మ్యూట్ చేయించారట సెన్సార్ మెంబర్లు. మొత్తానికి అడ్డంకులన్నీ పూర్తి కావడంతో.. రేపు అంటే జూన్ 10న విడుదలయ్యేందుకు దో లఫ్జోం కీ కహానీ సిద్ధమైంది. మరి కాజల్ లిప్ లాక్ ని చూసి ఎంజాయ్ చేయాలని అనుకునే వారు.. ఇక సిద్ధమైపోవచ్చు.
Tags:    

Similar News