ఈరోజు విడుదలైన ''ఎం.ఎస్.ధోని'' సినిమా అన్ని చోట్లా మన భారత్ క్రికెట్ కెప్టెన్ తరహాలో హెలికాప్టర్ షాట్ కొట్టిందనే చెప్పాలి. హిందీ వర్షెన్ మాత్రమే కాకుండా తెలుగు అండ్ తమిళంలో కూడా ధోని సినిమాకు మాంచి ఓపెనింగ్సే వచ్చాయని తెలుస్తోంది. అదండీ మన మహేంద్ర సింగ్ ధోనీ మహిమ. అతగాడి క్రేజ్ ఆ రేంజులో ఉంది. అయితే ఈ సినిమాకు సెన్సార్ కట్స్ ఇచ్చిన తీరు చూస్తే మాత్రం మనకు షాక్ తగలక మానదు.
దాదాపు 190 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకు ఏకంగా 5 నిమిషాలు కటింగ్స్ చెప్పారు. షుమారుగా 50 కట్స్ అంటే చూస్కోండి మరి. అయితే ఈ కట్స్ లో ఎక్కువశాతం.. క్రౌడ్ షాట్ తీసేయండి.. వైడ్ షాట్ కట్ చేయండి.. వంటివే ఉన్నాయి. వాటివలన నిజంగా వచ్చిన అభ్యంతరం ఏంటో తెలియదు కాని.. ఇన్నేసి కట్లు ఇవ్వడం చూస్తుంటే అసలు సెన్సార్ చేసేవారికి కనీసం సినిమా మీద ఏదైనా అవగాహన ఉందా అనే సందేహం రాకమానదు.
పైగా సెన్సార్ బోర్డు వారే కొన్ని డైలాగులు - షాటు తీసేయించి.. కొన్నింటిని యాడ్ చేయించారు కూడా. చూస్తుంటే రానున్న రోజుల్లో మనం సినిమా షూట్ చేసి వారి ఆఫీస్ కు పంపేస్తే.. వారే ఎడిటింగ్ కూడా చేసేలా ఉన్నారే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/