మా సినిమా చూసి సెన్సార్ టీమ్ కూడా ఆశ్చర్యపోయింది... ఇలాంటి సినిమాని ఇంతవరకూ చూడలేదని మెచ్చుకుందనే డైలాగ్‌ని తరచుగా వింటుంటాం. సినిమా తీసిన ప్రతి ఒక్కరూ రిలీజ్ కి ముందు చెప్పే మాటే ఇది. మొదట్లో ఈ మాటల్ని సీరియస్‌గా తీసుకొనేవాళ్లు ప్రేక్షకులు. రానూ రానూ ఇది కూడా ఓ పబ్లిసిటీ స్టంటే అని అర్థమైపోయింది. దాంతో ఎవరు ఈ మాట చెప్పినా ప్రేక్షకులు మాత్రం లైట్ గా తీసుకొంటున్నారు. అయితే ఇండస్ట్రీ వర్గాలు మాత్రం సెన్సార్ రిపోర్టు గురించి పక్కాగా ఆరా తీస్తుంటాయి. ఏ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో అడిగి తెలుసుకొనే ప్రయత్నం చేస్తుంటాయి. స్టార్ హీరోల సినిమాల విషయంలో అయితే ఆ ఆసక్తి మరింతగా పెరిగిపోతుంటుంది. సెన్సార్ పూర్తవ్వగానే సినిమా అలా ఉందంట, ఇలా ఉందంట అని ఇండస్ట్రీలో మాట్లాడుకోవడం మొదలుపెడుతుంటారు.
నిన్నటి నుంచి సంక్రాంతి సినిమాల సెన్సార్ హంగామా మొదలైంది. శతమానం భవతి చిత్రానికి నిన్ననే సెన్సార్ చేశారు. ఈ రోజు చిరు సినిమా `ఖైదీ నంబర్ 150` సెన్సార్ జరిగింది. అయితే షో అయిపోయిన వెంటనే టీమ్ సభ్యులు గట్టిగా క్లాప్స్ కొట్టారనే ఓ రిపోర్ట్ బయటికి వచ్చింది. ఆ రిపోర్టులో వాస్తవం ఎంతనేది పక్కనపెడితే, సెన్సార్ టీమ్ సభ్యులు మాత్రం చిరు `ఖైదీ నంబర్ 150`ని చూడటంపై అమితాసక్తిని ప్రదర్శించినట్టు తెలిసింది. ఏ సినిమాకీ లేనంతగా ఈ సినిమాని చూసేందుకు టీమ్ మొత్తం హాజరైందట. సెన్సార్ బృందంలో మొత్తం 18 మంది ఉంటారు. వాళ్లంతా కూడా చిరు సినిమాని చూడటం విశేషం అని ఫిల్మ్ నగర్ లో మాట్లాడుకొంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/