వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రాంగోపాల్ వర్మ అని అందరికి తెలిసిందే. దేశంలో లాక్ డౌన్ కారణంగా సినిమా థియేటర్లు మూతపడినా ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌లో ఒక్కో మూవీ రిలీజ్ చేస్తూనే ఉన్నాడు వర్మ. ఇటీవలే 'పవర్ స్టార్' సినిమా రిలీజ్ చేసి లాభాలను ఖాతాలో వేసుకుంటున్నాడు. వర్మకు మీడియాను ఎలా వాడుకోవడంలో దిట్ట. ఒక విధంగా వర్మ తర్వాతే ఎవరైనా అని చెప్పవచ్చు. ఎల్లప్పుడూ వార్తలలో వర్మకు ఈసారి జిహెచ్ఎంసి షాక్ ఇచ్చింది. వర్మకు 4వేల రూపాయలు జరిమానా వేస్తూ నోటీసు పంపింది. నిబంధనలకు విరుద్ధంగా వేసిన పోస్టర్ల వలన ఈ జరిమానా విధించడం జరిగింది. అయితే తాజాగా సెంట్రల్ సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ సెల్ కూడా ఆర్జీవీకి భారీ షాక్ ఇచ్చింది. అనుమతులు లేకుండా పవర్ స్టార్ సినిమా పోస్టర్లు అతికించడం పై ఆగ్రహంతో సీఈసీ..
ఖంగుతినే విధంగా జరిమానా భారీగా విధించింది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా మొత్తం 30కి పైగా పోస్టర్లు ఏర్పాటు చేశారట. ఎన్ఫోర్స్మెంట్, డీఆర్ఎఫ్ బృందాల తనిఖీలలో ఏ ఒక్క దానికి అనుమతి తీసుకోలేదని తేలడంతో అందిన ఫిర్యాదుల మేరకు 88,000 రూపాయల జరిమానా విధించినట్లు తెలిపింది. ఈవీడీఎం డిపార్ట్మెంటు నుంచి రాజీవ్ అండ్ టీం నోటీసులు అందుకున్నారని సమాచారం. ఇక ఈ భారీ జరిమానాతో ఆర్జీవీ కూడా ఖంగుతిన్నట్లు సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. 37 నిమిషాల నిడివితో తీసిన సినిమాలో.. పవర్ స్టార్ పై ఏముంటుందోనని ఫ్యాన్స్ ఆందోళన చేపట్టారు. ఆర్జీవీ ఆఫీసు పై పలువురు దాడికి కూడా పాల్పడ్డారు. అయితే మూవీలో వర్మ మాత్రం ఎన్నికల ఫలితాల తరువాత పరిస్థితులు మాత్రమే చూపించి కాష్ చేసుకున్నట్లు నెటిజన్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.