చ‌నిపోయాక ఆస్కార్ కి నామినేట్ అయిన గ్రేట్ న‌టుడు

Update: 2021-03-16 11:31 GMT
ఆస్కార్ 2021 నామినేషన్లలో బ్లాక్ పాంథ‌ర్ న‌టుడు చాడ్విక్ బోస్మాన్ పేరు ప్ర‌ముఖంగా హైలైట్ అవుతోంది. ఆయ‌న వీరాభిమానులు క‌చ్ఛితంగా 2021 ఆస్కార్ అవార్డ్ ద‌క్కాల్సిందేన‌ని సోష‌ల్ మీడియాల్లో నిన‌దిస్తున్నారు. `మా రైనీస్ బ్లాక్ బాటమ్` అనే చిత్రంలో న‌టించిన బోస్మాన్ కు మరణానంతరం నామినేష‌న్ ద‌క్క‌డంపై విస్త్ర‌తంగా అభిమానుల్లో చ‌ర్చ సాగుతోంది. ఈ సినిమాలో న‌ట‌న‌కు గాను ఉత్తమ నటుడి విభాగంలో అకాడమీ అవార్డుకు అత‌డు అర్హుడు అన్న విశ్లేష‌ణ కూడా సాగుతోంది.

బ్లాక్ పాంథర్ స్టార్ బోస్మాన్ కి ఆస్కార్ నామినేషన్ ద‌క్క‌గానే.. అతని కుటుంబం.. సహచరులు ఎమోష‌కి గుర‌య్యారు. గత సంవత్సరం బోస్మాన్ మ‌ర‌ణం క‌ల‌త‌కు గురి చేయ‌గా.. నేటి ఈ క్ష‌ణం ఎంతో ఉద్విగ్న‌మైన‌ద‌న్న భావ‌న వారిలో నెల‌కొంది.

చాడ్విక్ మరణానంతర నామినేష న్ కు అర్హుడ‌య్యారు. ఆయ‌న ఇంత‌కుముందు మోషన్ పిక్చర్ డ్రామా విభాగంలో ఉత్తమ నటుడిగా గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెలుచుకున్నాడు. అతని భార్య టేలర్ సిమోన్ లెడ్వర్డ్ అతని తరపున ఈ అవార్డును స్వీకరించారు. దివంగత నటుడిని జ్ఞాపకం చేసుకోవడంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. అతను అందంగా ఏదో చెబుతాడు. ఏదో ఉత్తేజకరమైనది. మనలో ఉత్తేజం నింపే ఆ చిన్న స్వరం మ‌రువ‌లేను అని ఆవేద‌న‌కు గుర‌య్యారు.

అకాడమీ అవార్డుకు మరణానంతర ఆమోదం పొందిన నటుల జాబితాలో ఇప్పుడు చాడ్విక్ పేరు చేరింది. 1955 లో కన్నుమూసిన జేమ్స్ డీన్ 1955 లో ఈస్ట్ ఆఫ్ ఈడెన్ ... 1956 లో జెయింట్ లో న‌ట‌న‌కు ఉత్తమ నటుడి విభాగంలో అకాడమీ అవార్డులకు ఎంపికయ్యాడు. అలాగే హీత్ లెడ్జర్ కూడా నామినేట్ అయ్యాడు. 2008 లో ది డార్క్ నైట్ కొరకు ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్ అవార్డును గెలుచుకున్నాడు. 1995 లో ఇల్ పోస్టినోకు మాసిమో ట్రోయిసి ఉత్తమ నటుడు విభాగానికి నామినేట్ అయ్యారు.

చాడ్విక్ బోస్మాన్ పెద్దప్రేగు క్యాన్సర్ తో నాలుగేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత 2020 ఆగస్టు 28న కన్నుమూశారు. అతను తన అనారోగ్యాన్ని ప్రైవేటుగా ఉంచాడు. తన వృత్తిపరమైన జీవితంలోకి తన ఆరోగ్య సమస్యలను తేకుండా పనిచేశాడు. అతను క్యాన్సర్ చికిత్స పొందుతున్నప్పుడు మార్షల్- బ్లాక్ పాంథర్- ఎవెంజర్స్: ఎండ్‌గేమ్ -డా 5 బ్లడ్- మా రైనే -బ్లాక్ బాటమ్ త‌దిత‌ర చిత్రాల్లో న‌టించాడు.
Tags:    

Similar News