సీనియర్ల టాప్ గ్రాస్.. నెక్స్ట్ ఎవరు బ్రేక్ చేస్తారో?
టాలీవుడ్ లో ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోల జాబితాలో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ ఉన్నారు
టాలీవుడ్ లో ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోల జాబితాలో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ ఉన్నారు. ఒకప్పుడు వీరి నలుగురు మధ్యలో సినిమాల పోటీ నడిచేది. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో పాన్ ఇండియా హీరోల హవా నడుస్తోంది. ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోలు అత్యధిక మార్కెట్ ఉన్న స్టార్స్ గా కొనసాగుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి టాప్ హీరోల జాబితాలో ఉన్న అతని మార్కెట్ ఇంకా పాన్ ఇండియా స్టార్స్ రేంజ్ కి వెళ్ళలేదు. ‘విశ్వంభర’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయితే చిరంజీవి మార్కెట్ 300+ కోట్లు దాటిపోయే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు ఇప్పటికే వంద కోట్ల క్లబ్ లో చేరిపోయారు. వారు నటించిన సినిమాలలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ మొదటి స్థానంలో ఉంది.
ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 240 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక టాప్ 2 హైయెస్ట్ కలెక్షన్స్ చిత్రంగా మెగాస్టార్ ‘వాల్తేరు వీరయ్య’ 230 కోట్ల కలెక్షన్స్ తో నిలిచింది. ‘ఖైదీ 150’ చిత్రం 165 కోట్ల వసూళ్లతో టాప్ 3 లో ఉంది. వీటి తర్వాత విక్టరీ వెంకటేష్ ‘ఎఫ్ 2’ తో 131 కోట్ల కలెక్షన్స్ అందుకున్నాడు. ఈ మూవీ టాప్ 4 హైయెస్ట్ గ్రాస్ చిత్రంగా నిలిచింది. ఇక నందమూరి బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సినిమా 127 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకొని టాప్ 5 హైయెస్ట్ వసూళ్ల మూవీగా మారింది.
‘ఊపిరి’ సినిమాతో కింగ్ నాగార్జున 100 కోట్ల కలెక్షన్స్ ని అందుకున్నారు. ఇదిలా ఉంటే ఉంటే బాలయ్య నుంచి ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ మూవీ థియేటర్స్ లోకి వస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. వీకెండ్ లోపే 100 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ ని ఈ మూవీ అందుకుంటుందని మేకర్స్ భావిస్తున్నారు. అలాగే ఈ చిత్రంతో బాలయ్య 200 కోట్ల క్లబ్ లో చేరుతాడని అంచనా వేస్తున్నారు. సీనియర్ హీరోలలో అత్యధిక కలెక్షన్స్ రికార్డ్ చిరంజీవి పేరు మీద ఉంది.
‘డాకు మహారాజ్’ తో ఈ రికార్డ్ పై మేకర్స్ కన్నేశారు. దీనిని బాలయ్య అందుకుంటే మాత్రం కచ్చితంగా అది సెన్సేషన్ అవుతుంది. అలాగే వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం కూడా సంక్రాంతికి రానుంది. అనిల్ రావిపూడి - దిల్ రాజు కాంబినేషన్ కాబట్టి మార్కెట్ లో డిమాండ్ ఉంటుంది. ఇక ఇది వెంకీ మార్కెట్ ను ఏ స్థాయిలో నిలబెడుతుందో చూడాలి. ఇక మెగాస్టార్ నుంచి రాబోయే ‘విశ్వంభర’, ఆ తరువాత బాలయ్య, బోయపాటి కాంబో మూవీ ‘అఖండ 2’ సినిమాలు కూడా సైరా రికార్డ్ ని బ్రేక్ చేసే అవకాశం ఉంటుంది. ‘అఖండ 2’, ‘విశ్వంభర’ చిత్రాలు 300 కోట్ల క్లబ్ లో చేరిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని సీనీ విశ్లేషకులు అంటున్నారు.
టాలీవుడ్ సీనియర్ స్టార్స్ టాప్ గ్రాస్ మూవీస్
సైరా నరసింహారెడ్డి - 240 కోట్లు
వాల్తేరు వీరయ్య - 230 కోట్లు
ఖైదీ నెంబర్ 150 - 165 కోట్లు
ఎఫ్ 2 - 131 కోట్లు
వీరసింహారెడ్డి - 127 కోట్లు
అఖండ -125 కోట్లు
భగవంత్ కేసరి - 120 కోట్లు
గాడ్ ఫాదర్ - 108 కోట్లు