పరదా టీజర్.. సుబ్బు కథ ఇంట్రెస్టింగ్..!

ఆమెకు ఏమైంది అని చెప్పే కథే పరదా సినిమా కథ. నిమిషం టీజర్ లో సినిమా ఎలా ఉండబోతుంది అన్నది చెప్పేశాడు డైరెక్టర్ ప్రవీన్ కండ్రేగుల.

Update: 2025-01-22 12:53 GMT

ఒక సినిమా నుంచి రిలీజ్ అయ్యే టీజర్ తోనే సినిమా మీద ఒక బజ్ క్రియేట్ చేస్తుంది. చెప్పాలనుకున్న కథ.. తెరకెక్కించిన విజువల్స్.. కథ కథనానికి తగిన మ్యూజిక్.. నిమిషం టీజర్ తో ప్రేక్షకులను సినిమా మీద దృష్టి మళ్లించే ప్రయత్నం. ఇదే శాంపిల్ గా టీజర్ అని మనం అంటాం. ఈ టీజర్ తోనే సినిమాపై ఒక క్రేజ్ ఏర్పడేలా చేస్తుంటారు. స్టార్ సినిమాలకు టీజర్ లో ఏమున్నా సరే అది మిలియన్ల కొద్దీ వ్యూస్ లైక్స్ సాధిస్తుంది. కానీ ఒక కాన్సెప్ట్ సినిమా అలాంటి వ్యూస్ రాబట్టాలంటే మాత్రం అందులో కచ్చితంగా మ్యాటర్ ఉండాలి.

లేటెస్ట్ గా రిలీజైన పరదా టీజర్ చూస్తే మ్యాటర్ కావాల్సినంత ఉన్నట్టు అనిపిస్తుంది. పరదా వేసుకున్న అమ్మాయిగా అనుపమ చావడానికి 70 లక్షలు ఖర్చు పెట్టి మరీ ఒక ప్రాంతానికి వెళ్తుంది. ఈ ప్రయాణం అక్కడ సుబ్బు అదే మన పరదా అమ్మాయి ఏం చేసింది. ఆమెకు ఏమైంది అని చెప్పే కథే పరదా సినిమా కథ. నిమిషం టీజర్ లో సినిమా ఎలా ఉండబోతుంది అన్నది చెప్పేశాడు డైరెక్టర్ ప్రవీన్ కండ్రేగుల.

సినిమా బండి అంటూ తీసి తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న అతను క్షణం సినిమా నుంచి టెక్నికల్ టీం లో పనిచేస్తూ వచ్చాడు. ఇక ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై పరదా అంటూ తన ప్రతిభ చూపించబోతున్నాడు. ఈ సినిమాలో అనుపమ తనలోని మరో కొత్త నటిని పరిచయం చేసేలా ఉంది. ఈ సినిమాకు గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కొన్నాళ్లుగా సరైన సినిమా పడట్లేదని ఆకలితో ఉన్న గోపీ సుందర్ కి కరెక్ట్ సినిమా పడినట్టు అనిపించింది.

ఈ సినిమాను ఆనంద మీడియా బ్యానర్ లో విజయ్ దొంకడ, శ్రీనివాసులు ఎస్.వి, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. సినిమాలో హృదయం ఫేం దర్శన్ రాజేంద్రన్, సంగీత కూడా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్నారు. పరదా టీజర్ ఇంట్రెస్టింగ్ గా అనిపించగా సినిమా కచ్చితంగా ప్రేక్షకులను అలరించేలా ఉంటుందని చెప్పొచ్చు. అనుపమ పరమేశ్వరన్ కి కూడా ఈ సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉండేలా ఉంది. పరదా టీజర్ తో థమ్స్ అప్ అనిపించుకోగా ఇక సినిమా ఎలా ఉండబోతుంది అన్నది చూడాలి.

Full View
Tags:    

Similar News