అల్లు అర్జున్ పై రవి ప్రకాష్ షాకింగ్ కామెంట్స్..!

ఈ నేపథ్యంలో అల్లు అర్జున్, పుష్ప సినిమాలపై సీనియర్ జర్నలిస్ట్ రవి ప్రకాష్ షాకింగ్ కామెంట్స్ చేసాడు.

Update: 2025-01-22 12:44 GMT

టాలీవుడ్ లో రెండో రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి నగరంలోని పలువురు నిర్మాతల ఇళ్ళు, ఆఫీసులపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డైరెక్టర్ సుకుమార్ పైనా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని ఆయన ఇల్లు, ఆఫీసుల్లో తనిఖీలు చేస్తున్నారు. అటు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ మీద కూడా సోదాలు నడుస్తున్నాయి. 'పుష్ప 2' సినిమాలు భారీ కలెక్షన్ల సాధించిన తరుణంలో, ఐటీ దాడులు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్, పుష్ప సినిమాలపై సీనియర్ జర్నలిస్ట్ రవి ప్రకాష్ షాకింగ్ కామెంట్స్ చేసాడు.

రవి ప్రకాష్ తాజాగా 'ఎక్స్'లో పోస్ట్ పెడుతూ.. ''సో, అతిశయోక్తితో కూడిన 'పుష్ప' బాక్సాఫీస్ నంబర్స్ అల్లు అర్జున్‌ను గ్లోబల్ స్టార్‌గా చేస్తాయని అనుకున్నారా? కానీ బదులుగా ఆ సినిమా అతని వ్యక్తిగత దురదృష్టంగా మారినట్లు అనిపిస్తుంది. క్రూరమైన నిర్లక్ష్యం కారణంగా మొదట తొక్కిసలాట సంఘటన జరిగింది.. ఆ తర్వాత అతను అంతే నిర్లక్ష్యంగా ప్రెస్ మీట్ పెట్టాడు. ఒకవిధంగా పరిస్థితులను మరింత దిగజార్చాడు. అతను తన సినిమా రీ-రిలీజ్ సమయంలో బాధితులను పరామర్శించాడు. ఐరనీ ఏంటంటే, ఆ పెంచిన నంబర్స్ ఇప్పుడు ITR రూపంలో అతన్ని వెంటాడుతున్నట్లు కనిపిస్తోంది. బహుశా 'పుష్ప 3' మూవీకి “రెక్లెస్ రిటర్న్స్” అని పేరు పెట్టాలి. గ్లోబల్ స్టార్‌డమ్ కోసం వెయిట్ చెయ్యొచ్చు.. కానీ ముందుగా డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాలి'' అని పేర్కొన్నాడు. దీనిపై బన్నీ డ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అటెన్షన్, సెన్సేషనలిజం కోసమే రవి ప్రకాష్ ఇలాంటి పోస్టులు పెడతాడని కామెంట్స్ ట్రోల్ చేస్తున్నారు.

నిజానికి రవి ప్రకాష్ మొదటి నుంచే 'పుష్ప 2: ది రూల్' సినిమాని, హీరో అల్లు అర్జున్ ని టార్గెట్ గా చేసుకొని పోస్టులు పెడుతూ వచ్చాడు. సంధ్య థియేటర్ ఘటన, బన్నీ అరెస్ట్, తదనంతర పరిణామాలపై తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పెడుతూ వచ్చాడు. రీసెంట్ గా 'పుష్ప 2' రీలోడెడ్ వెర్షన్ ను థియేటర్లలో ప్రదర్శించడంపైనా ఆయన సెటైర్లు వేసాడు. ''షోబిజ్ సర్కస్ ఎప్పుడూ ఆశ్చర్యపరచదు. ఏదైనా ప్రమాదం, ఏదైనా విషాదం వారి ఎజెండాకు మరో మెట్టు మాత్రమే. శ్రీ తేజ్‌ను అల్లు అర్జున్ పరామర్శించిన సమయాన్ని బట్టి చూస్తే, ఇదంతా రీరిలీజ్ ప్రకటన కోసమే అని ఆశ్చర్యపోకుండా ఉండటం కష్టం.''

''అతని మార్కెటింగ్ వెనుక ఉన్న ఈ ఆత్మలేని సూత్రధారులు ఎవరు? మానవత్వాన్ని పూర్తిగా కోల్పోయిన టీమ్? మనం ఎలాంటి ప్రపంచాన్ని సృష్టిస్తున్నాము? ఇక్కడ వ్యాపారం కరుణపై విజయం సాధిస్తుంది, ఇక్కడ హీరోలు అమ్మకానికి ఉన్న ప్రోడక్ట్స్ తప్ప మరేమీ కాదు?. నా వరకూ అల్లు అర్జున్ అధికారికంగా దానిని కోల్పోయాడు. 'సూపర్ స్టార్' అనే అతని వ్యామోహం అతనిలో మానవత్వం రూపాన్ని కూడా కోల్పోయేలా చేసింది. అతని చేష్టలు బాధాకరమైనవిగా ఉన్నాయి. జనాలు ఈ హీరో-వర్షిప్ అర్ధంలేనితనాన్ని ఆమోదించడం మానేయడానికి ఇది సరైన సమయం'' అని రవి ప్రకాష్ బన్నీని ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు 'పుష్ప 2' మేకర్స్ పై ఐటీ దాడులు జరుగుతున్న నేపథ్యంలో, మరోసారి అల్లు అర్జున్ లక్ష్యంగా షాకింగ్ కామెంట్స్ చేసాడు.



Tags:    

Similar News