థియేటర్‌లో సూపర్‌ హిట్‌ వెబ్‌ సిరీస్‌...!

కేరళలోని అన్ని థియేటర్‌లలో ఈ సిరీస్ టీజర్‌ను స్క్రీనింగ్‌ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.;

Update: 2025-03-28 17:30 GMT
Kerala Crimes teaser in Theaters

2023లో వచ్చిన 'కేరళ క్రైమ్‌ ఫైల్స్‌' వెబ్‌ సిరీస్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అయిన ఆ వెబ్‌ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సమయంలో సంచలనం సృష్టించిన ఈ వెబ్‌ సిరీస్‌కి తాజాగా సీజన్ 2 ను రూపొందించారు. కేరళ క్రైమ్‌ ఫైల్స్ సీజన్ 1 స్ట్రీమింగ్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో సీజన్ 2 ను అధికారికంగా ప్రకటించారు. కాస్త ఆలస్యం అయిన ఈ వెబ్‌ సిరీస్ సీజన్ 2ను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక వెబ్‌ సిరీస్‌ టీజర్‌ను థియేటర్‌లో స్క్రీనింగ్‌ చేయబోతున్నారు. కేరళలోని అన్ని థియేటర్‌లలో ఈ సిరీస్ టీజర్‌ను స్క్రీనింగ్‌ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.


'కేరళ క్రైమ్‌ ఫైల్స్‌' సీజన్ 2 టీజర్ కట్ ను సెన్సార్ ముందుకు తీసుకు వెళ్లారు. ఎలాంటి కట్స్ లేకుండా సెన్సార్‌ క్లియరెన్స్ దక్కిన టీజర్‌ను త్వరలోనే థియేటర్‌లో స్క్రీనింగ్‌ చేయబోతున్నారు. ఒక నిమిషం పది సెకన్లు నిడివితో ఉన్న ఈ వెబ్‌ సిరీస్‌ టీజర్‌ను థియేట్రికల్‌ స్క్రీనింగ్‌ చేయడం ద్వారా అరుదైన ఘనత దక్కించుకోబోతున్నారు. ఈమధ్య కాలంలో వచ్చిన ఎన్నో వెబ్‌ సిరీస్లు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. థియేట్రికల్‌ రిలీజ్ అయిన సినిమాల కంటే ఎక్కువ మంది చూసిన వెబ్‌ సిరీస్‌లు వచ్చాయి. కానీ ఇలా థియేటర్‌లో టీజర్‌ వచ్చిన వెబ్‌ సిరీస్ మాత్రం ఇదే. ఈ వెబ్‌ సిరీస్‌ క్రేజ్‌ నేపథ్యంలో ప్రయోగాత్మకంగా ఇలా టీజర్‌ను థియేటర్‌లో స్క్రీనింగ్‌ చేసి పబ్లిసిటీ చేయబోతున్నారు.

అజు వర్గీస్‌, లాల్‌, జిన్జ్‌ షాన్‌, శ్రీజిత్‌, నివాస్ కీలక పాత్రల్లో నటించిన కేరళ క్రైమ్‌ ఫైల్స్ వెబ్‌ సిరీస్‌కి అహ్మ‌ద్ క‌బీర్ ద‌ర్శ‌క‌త్వం వహించాడు. ఆరు ఎపిసోడ్స్‌గా స్ట్రీమింగ్‌ అయిన ఆ వెబ్‌ సిరీస్‌కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్ దక్కింది. మలయాళంలో వచ్చిన ఆ వెబ్‌ సిరీస్‌కు సంబంధించిన ప్రతి విషయమై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అందుకే సీజన్ 2 ను ఆలస్యం చేయకుండా వెంటనే స్ట్రీమింగ్‌ చేసేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి. అతి త్వరలోనే ఈ వెబ్‌ సిరీస్‌ను స్ట్రీమింగ్‌ చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సీజన్‌ 2 ను సైతం జియో హాట్‌స్టార్‌లోనే స్ట్రీమింగ్‌ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

మొదటి సీజన్‌తో పోల్చితే సీజన్‌ 2 లో మరింతగా ఆసక్తికర క్రైమ్‌ సీన్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వెబ్‌ సిరీస్‌ టీజర్‌కి యూ/ఏ సర్టిఫికెట్‌ వచ్చింది. థియేటర్‌లో స్క్రీనింగ్‌ కాబోతున్న ఈ వెబ్‌ సిరీస్‌ టీజర్‌తో మరింతగా పబ్లిసిటీ దక్కే అవకాశాలు ఉన్నాయి. సీజన్‌ 1 లో ఒక లాడ్జ్‌లో జరిగిన హత్య చుట్టూ కథ తిరుగుతుంది. సీజన్ 2 లో సైతం ఒక క్రైమ్‌ స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. మొదటి సీజన్‌కి వచ్చిన రెస్పాన్స్ నేపథ్యంలో తెలుగు, ఇతర భాషల్లోనూ ఈ వెబ్‌ సిరీస్‌ను ప్రేక్షకులకు మొదటి రోజు నుంచి అందుబాటులో ఉంచే అవకాశాలు ఉన్నాయి. టీజర్ రెడీ అయిన నేపథ్యంలో త్వరలోనే వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ అప్‌డేట్‌ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News