పిక్‌టాక్ : జగతి మేడం కొత్త ఫోటోలు చూశారా!

తెలుగు బుల్లి తెరపై ఈమె ఎంట్రీ నేపథ్యంలో తక్కువ సమయంలోనే ఎక్కువ గుర్తింపు దక్కించుకుంది.;

Update: 2025-03-28 19:30 GMT
పిక్‌టాక్ : జగతి మేడం కొత్త ఫోటోలు చూశారా!

తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను గుప్పెడంత మనసు సీరియల్‌తో అలరించిన నటి జ్యోతి రాయ్‌. కర్ణాటకలోని మడికేరిలో 1994లో జన్మించిన జ్యోతి రాయ్‌ బుల్లి తెరపై స్టార్‌ హీరోయిన్‌ స్థాయిలో గుర్తింపు దక్కించుకుంది. కన్నడ, తెలుగు సీరియల్స్‌తో ప్రేక్షకులకు చేరువ అయిన ఈమె సినిమాల్లోనూ నటించడం ద్వారా ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ అయింది. తెలుగులో ఈమె నటించిన గుప్పెడంత మనసు సీరియల్‌లో జగతి పాత్రలో నటించడం ద్వారా బాగా పాపులర్ అయింది. తెలుగు బుల్లి తెరపై ఈమె ఎంట్రీ నేపథ్యంలో తక్కువ సమయంలోనే ఎక్కువ గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత పలు టీవీ షోల్లోనూ కనిపించింది.


సోషల్‌ మీడియా ద్వారా రెగ్యులర్‌గా ఫోటోలు షేర్‌ చేసే ఈమె హీరోయిన్స్‌ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నారు. ఆరు లక్షలకు పైగా ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న ఈ బుల్లి తెర నటి సోషల్‌ మీడియాలో ఫోటోలు షేర్ చేసిన ప్రతిసారి జనాలు షాక్ అవుతూనే ఉంటారు. సీరియల్స్‌లో ఆంటీలా కనిపించే ఈమె ఇక్కడ మాత్రం ఇలా ఎలా కనిపిస్తుందని పలువురు కామెంట్‌ చేస్తూ ఉంటారు. ఎక్కువగా స్కిన్ షో చేసే ఫోటోలను షేర్ చేయడం ద్వారా వైరల్‌ అవుతూ ఉంటుంది. కన్నడంలో ఈమెకు దక్కిన గుర్తింపుకు ఏమాత్రం తగ్గకుండా తెలుగులోనూ ఈమెకు భారీ ఎత్తున ఫాలోయింగ్‌ సొంతం అయింది. అందుకే సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమెకు మంచి ఫాలోయింగ్‌ ఉంది.


అమ్మ పాత్రలో నటించిన ఈమె సోషల్‌ మీడియాలో అమ్మాయిగా కనిపించడం మనం రెగ్యులర్‌గా చూస్తూనే ఉంటాం. ఎప్పుడూ మోడ్రన్‌ డ్రెస్‌ల్లో చూపు తిప్పుకోనివ్వని ఈమె ఈసారి మాత్రం చాలా సింపుల్‌ అండ్‌ స్వీట్‌ లుక్‌లో కనిపించింది. చీర కట్టులో ఈమె కనిపించిన తీరుకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. సాధారణంగా సెలబ్రెటీలు ఇలాంటి ఔట్‌ ఫిట్స్‌లో తక్కువగా కనిపిస్తూ ఉంటారు. చీర కట్టులో కనిపిస్తే చాలా స్పెషల్‌గా ఈమె కనిపిస్తుంది. ప్లేన్‌ చీర కట్టులో ఈమెను చూసి నెటిజన్స్‌ వావ్‌ అంటున్నారు. చీర కట్టులోనూ జగతి మేడం సూపర్‌ అంటూ కామెంట్‌ చేస్తున్నారు.


సీరియల్‌లో ఈమెను చూడగానే చేతులు ఎత్తి దండం పెట్టాలి అనిపించేంత హుందాగా ఉంటారనే టాక్‌ దక్కించుకున్నారు. అలాంటి ఈమె సోషల్‌ మీడియాలో ఆ మధ్య రెచ్చి పోయి వర్కౌట్‌ వీడియోలు, ఫోటోలు షేర్‌ చేశారు. అంతే కాకుండా స్కిన్‌ షో ఫోటోలు షేర్ చేయడం ద్వారా హీరోయిన్‌గానూ ఆఫర్లు వచ్చాయి. ఒక సినిమాలో నటించడంతో పాటు వెబ్‌ సిరీస్‌లోనూ ఈమెకు ఆఫర్లు వచ్చాయి. తెలుగులో ఈమెను వెండి తెరపై చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News