రెండేళ్లగా చెక్కుతున్నాం..మామూలుగా ఉండదు!
అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందే సాయితేజ్ మరో ప్రాజెక్ట్ లాక్ చేసినట్లు తెలుస్తోంది.;

మెగా మేనల్లుడు సాయితేజ్ హీరోగా 'సంబరాల ఏటిగట్టు' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. 'విరూపాక్ష' తర్వాత చాలా గ్యాప్ తీసుకుని చేస్తోన్న చిత్రమిది. ప్రస్తుతం సెట్స్ లో ఉందీ చిత్రం. అన్ని పనులు పూర్తిచేసి సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందే సాయితేజ్ మరో ప్రాజెక్ట్ లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఓ తమిళ యువ దర్శకుడు చెప్పిన కథకు సాయితేజ్ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడుట.
ఇదొక భిన్నమైన లవ్ స్టోరీ అట. ఇప్పటి వరకూ ఇండియన్ స్క్రీన్ పై రాని లవ్ స్టోరీగా వినిపిస్తుంది. ఇదే కథపై దర్శకుడు రెండేళ్లగా పని చేస్తున్నాడుట. ఈ కథకు `ఇది మామూలు ప్రేమకథ కాదు` అనే టైటిల్ కూడా ఫిక్సై అయిందిట. స్టోరీకి పర్పెక్ట్ గా ఈ టైటిల్ సెట్ అవ్వడంతో మరో ఆలోచన లేకుండా సాయితేజ్ పైనల్ చేసాడుట. ఈ చిత్రాన్ని టాలీవుడ్ కి చెంది ఓ అగ్ర నిర్మాణ సంస్థ నిర్మించడానికి ముందుకొస్తుందిట.
ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం. మొత్తానికి సాయితే విరూపాక్ష తర్వాత కొత్త సినిమా రిలీజ్ ఆలస్యమైనా బ్యాక్ టూ బ్యాక్ ప్లాన్ చేస్తున్నాడు. సంబరాల ఏటిగట్టు చిత్రీకరణ ముగింపు దశకు చేరుకోగానే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కించే అవకాశం ఉంది. అంటే ఏడాది చివర్లో ఈ చిత్రాన్ని కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. లేదంటే సంక్రాంతి సీజన్ వదిలేసి వచ్చే సమ్మర్ టార్గెట్ చేసే అవకాశం ఉంది.
`విరూపాక్ష` చిత్రం సాయితేజ్ ని 100 కోట్ల క్లబ్ లో చేర్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కెరీర్ పరంగా మరింత జాగ్రత్తగా వహిస్తున్నాడు. తదుపరి ఏ సినిమా చేసినా అది హిట్ బొమ్మ అవ్వాలనే కసితో ముందు కెళ్తున్నాడు. ఈ క్రమంలో కొత్త సినిమాల విషయంలో జాప్యం చోటు చేసుకుంటుంది. అటు తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా అన్నయ్యనే ఫాలో అవుతున్నాడు. ఫాం కోల్పోయిన వైష్ణవ్ హిట్ సినిమాతో కంబ్యాక్ అవ్వాలనే కసితో కథ కోసం వెతుకుతున్నాడు.