పిక్‌టాక్ : డాకు మహారాణి అందం చూశారా!

పదేళ్ల క్రితం టాలీవుడ్‌లో అడుగు పెట్టిన ప్రగ్యా జైస్వాల్‌ ఆశించిన స్థాయి స్టార్‌డం దక్కించుకోలేక పోయింది.

Update: 2025-01-22 10:16 GMT

పదేళ్ల క్రితం టాలీవుడ్‌లో అడుగు పెట్టిన ప్రగ్యా జైస్వాల్‌ ఆశించిన స్థాయి స్టార్‌డం దక్కించుకోలేక పోయింది. మిర్చిలాంటి కుర్రాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినా కంచె సినిమాతోనే ఎక్కువ మంది ఈ అమ్మడిని గుర్తు పట్టడం మొదలు పెట్టారు. వరుణ్‌ తేజ్‌కి జోడీగా నటించి మెప్పించిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్‌ మరోసారి తన అందంతో ఆకట్టుకుంది. సోషల్‌ మీడియా ద్వారా రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా హీరోయిన్‌గా కంటే ఎక్కువగా సోషల్‌ మీడియా ద్వారానే పాపులారిటీని ఈ అమ్మడు సొంతం చేసుకుంది. ఇన్‌స్టాలో ఈ అమ్మడికి దాదాపుగా మూడు మిలియన్‌ల ఫాలోవర్స్ ఉన్నారు.


తన సోషల్‌ మీడియా ఫాలోవర్స్‌ కోసం రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను షేర్‌ చేసే ప్రగ్యా జైస్వాల్‌ తాజాగా మరోసారి తన అందమైన ఫోటోలను షేర్‌ చేసింది. ఈసారి నడుము అందం చూపిస్తూ క్లీవేజ్ షో చేసిన ముద్దుగుమ్మ అంతకు మించి అన్నట్లుగా తన అందంతో ఆకట్టుకుంది. ప్రతిసారి సింప్లీ సూపర్‌ అనిపించే విధంగా ఫోటోలకు ఫోజ్‌లు ఇచ్చే ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్‌ మరోసారి తన అందంతో అలరించింది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అంటూ ఈ ఫోటోలు చెప్పకనే చెబుతున్నాయి. అందమైన ఈ అమ్మడి ఫోటోలు ఎప్పటిలాగే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.


ఇక ఈ అమ్మడు బాలకృష్ణతో అఖండ సినిమాలో నటించి హిట్‌ దక్కించుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమా తర్వాత ప్రగ్యా జైస్వాల్‌ కెరీర్ ఊపందుకుంటుందని అంతా భావించారు. కానీ పెద్దగా ఆఫర్లు రాలేదు. కానీ ఇండస్ట్రీలోనే ఉండే విధంగా అడపా దడపా ఆఫర్లు వచ్చాయి. తాజాగా సంక్రాంతి కానుకగా వచ్చిన డాకు మహారాజ్ సినిమాలో బాలకృష్ణకు జోడీగా నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రగ్యా జైస్వాల్‌ మరో విజయాన్ని బాలకృష్ణతో దక్కించుకుని టాలీవుడ్‌లో మరికొంత కాలం కొనసాగే అవకాశంను దక్కించుకుంది. ముందు ముందు సీనియర్‌ హీరోలకు ఈమె మోస్ట్‌ వాంటెడ్‌ అవుతుందా అనేది చూడాలి.


గత సంవత్సరం హిందీలో ఈ అమ్మడు నటించిన ఖేల్ ఖేల్ మే సినిమా సైతం పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేయక పోవడంతో బాలీవుడ్‌ నుంచి వస్తాయనుకున్న ఆఫర్లు చేజారాయి. ఆకట్టుకునే అందంతో పాటు మంచి స్కిన్‌ టోన్ ఉండే ఈ అమ్మడు తన ఫోటోలను రెగ్యులర్‌గా సోషల్‌ మీడియా ద్వారా షేర్ చేస్తూ వస్తుంది. కనుక ముందు ముందు అయినా ఈ అమ్మడికి ఇండస్ట్రీలో మరిన్ని ఆఫర్లు వస్తాయేమో చూడాలి. డాకు మహారాజ్‌ హిట్‌తో టాలీవుడ్‌లో ఈ ఏడాది రెండు మూడు సినిమాల్లో నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.


Tags:    

Similar News