పుష్ప 2 బ్యాగ్రౌండ్ స్కోర్… మొత్తం ఎంతమంది?
‘పుష్ప 2’ మూవీ రిలీజ్ కి టైమ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో సుకుమార్ టీమ్ మొత్తం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పైన పూర్తిస్థాయిలో ఫోకస్ చేసింది
‘పుష్ప 2’ మూవీ రిలీజ్ కి టైమ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో సుకుమార్ టీమ్ మొత్తం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పైన పూర్తిస్థాయిలో ఫోకస్ చేసింది. మూవీని బెస్ట్ గా నిలిపి ప్రేక్షకులకి సరికొత్త అనుభూతి అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కచ్చితంగా ఈ మూవీ 1000 కోట్ల క్లబ్ లో చేరుతుందని నమ్మకంతో మేకర్స్ ఉన్నారు. ఇండియాలోనే హైయెస్ట్ ప్రీరిలీజ్ బిజినెస్ జరిగిన చిత్రంగా ‘పుష్ప 2’ నిలిచినట్లు చెబుతున్నారు.
ఇక బిజినెస్ కి తగ్గట్లుగానే మూవీ కలెక్షన్స్ వస్తాయని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే పుష్ప సినిమాకి దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన సాంగ్స్ అందించడంతో పాటు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో కూడా అందరిని మెప్పించాడు. అలాగే ‘పుష్ప 2’ మూవీకి బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇచ్చాడు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చిన రెండు సాంగ్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. నెక్స్ట్ రాబోయే ఐటెం సాంగ్ కూడా ట్రెండ్ సెట్ చేయడం గ్యారెంటీ అనుకుంటున్నారు.
అయితే ఈ సినిమా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఈ సారి దేవిశ్రీ ప్రసాద్ మాత్రమే చేయడం లేదు. థమన్ ఈ మూవీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కోసం వర్క్ చేస్తున్నట్లు ఇప్పటికే కన్ఫర్మ్ చేశాడు. అలాగే తనతో పాటు మరికొంతమంది కూడా బ్యాగ్రౌండ్ స్కోర్ మీద పనిచేస్తున్నారని పరోక్షంగా తెలిపారు. అందరం కలిసి వాట్సాప్ గ్రూప్ లో కనెక్ట్ అవుతూ కమ్యూనికేట్ అవుతున్నామని, ఫైనల్ గా బెస్ట్ అవుట్ పుట్ ఇస్తామని అన్నారు.
దీంతో ‘పుష్ప 2’కి బ్యాగ్రౌండ్ స్కోర్ మీద పనిచేస్తోన్న మిగిలిన మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరనే ప్రశ్న సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న సమాచారం మేరకు అయితే అజనీష్ లోకనాథ్, సామ్ సిఎస్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారంట. అంటే దేవిశ్రీప్రసాద్ తో కలుపుకొని మొత్తం నలుగురు ‘పుష్ప 2’ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కోసం వర్క్ చేస్తున్నారని అంటున్నారు. అయితే దీనిపై మేకర్స్ ఎలాంటి అఫీషియల్ క్లారిటీ ఇవ్వలేదు.
డైరెక్ట్ గా మూవీ రిలీజ్ అయ్యే సమయంలోనే మిగిలిన మ్యూజిక్ డైరెక్టర్స్ పేర్లు టైటిల్ కార్డ్స్ లో వేసే అవకాశం ఉందని అనుకుంటున్నారు. థమన్ పేరు బయటకి రావడంతోనే డాకు మహారాజ్ మూవీ టీజర్ రిలీజ్ సందర్భంగా క్లారిటీ ఇచ్చి ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది. ఎంత మంచి మ్యూజిక్ అందించిన ఫైనల్ గా ఆడియన్స్ కి కావాల్సింది బెస్ట్ మ్యూజిక్. ప్రేక్షకులు థియేటర్స్ లో సినిమాని చూసినపుడు కంటెంట్, బన్నీ పెర్ఫార్మెన్స్ కి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఇవి కనెక్ట్ అవ్వాలంటే మంచి ఎలివేషన్ మ్యూజిక్ ఉండాలి. మరి ‘పుష్ప 2’ కోసం సుకుమార్ చేస్తోన్న ఈ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప్రయోగం ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందనేది వేచి చూడాలి.