అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఏజెంట్ సినిమా మొన్నటి వరకు ఆగస్టు లో విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. షూటింగ్ పలు కారణాల వల్ల ఆలస్యం అవుతుందట. దాంతో సినిమా వాయిదా వేయాల్సి వచ్చిందని యూనిట్ సభ్యులు ఇటీవలే ప్రకటించిన విషయం తెల్సిందే.
ఆగస్టు మిస్ చేసుకున్న ఏజెంట్ విడుదలకు ఇప్పట్లో గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశం లేదని అంతా అనుకున్నారు. సురేందర్ రెడ్డి స్లోగా సినిమాను రూపొందిస్తున్నాడు. ప్రతి విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి జాగ్రత్తలు పాటిస్తున్నారట. అందుకే ఏజెంట్ సినిమా ఈ ఏడాదిలో వచ్చేది అనుమానమే అన్నట్లుగా కూడా ప్రచారం జరింది.
కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సంవత్సరంలోనే ఏజెంట్ ను టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దించే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. షూటింగ్ ను సెప్టెంబర్ వరకు లేదంటే అక్టోబర్ లో అయినా ముగించి సినిమా ను డిసెంబర్ లో ఎట్టి పరిస్తితుల్లో విడుదల చేయాలనే పట్టుదలతో నిర్మాత మరియు దర్శకుడు ఉన్నట్లుగా మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
పైగా డిసెంబర్ లో విడుదల అవ్వబోతున్నట్లుగా ఒక పెద్ద హీరో సినిమాకు సంబంధించిన అధికారిక అప్డేట్ ఆ మధ్య వచ్చింది. తాజాగా ఆ సినిమాను విడుదల వాయిదా వేయాలని యూనిట్ సభ్యులు నిర్ణయించుకున్నారట. దాంతో ఆ తేదీని ఏజెంట్ కోసం వినియోగించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
అఖిల్ ఈ సినిమాలో ఓ హాలీవుడ్ హీరోగా కనిపించబోతున్నాడు అన్నట్లుగా ఆయన ఫిజిక్ ను చూపిస్తున్నారు. హీరోగా అఖిల్ ఇప్పటి వరకు దక్కించుకుని కమర్షియల్ బ్లాక్ బస్టర్ ను ఈ సినిమా తో దక్కించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. యూనిట్ సభ్యులు కూడా సరైన సమయంలో సినిమాను విడుదల చేస్తే బాగుంటుందనే డిసెంబర్ 23కి ఫిక్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.