టాలీవుడ్ లో పరాయి భాషల భామలు వెలిగిపోవడం కొత్తేమీ కాదు. గ్లామర్ పేరుతో కొందరు.. ట్యాలెంట్ అంటూ మరికొందరు.. ఐటెం సాంగ్స్ అంటూ ఇంకొందరు.. ఇలా రకరకాలుగా ఎంట్రీ ఇచ్చేసి ఇక్కడ పాతుకుపోతుంటారు. క్రేజ్ సంపాదించుకుంటారు.
ఇక వేరే కొందరు బాలీవుడ్ భామలు అయితే.. డబ్బుల కోసమో.. ప్రాక్టీస్ కోసమో కూడా తెలుగు సినిమాలు చేస్తుంటారు. ఎలాగైతేనేమి.. ఇలా కొంత క్రేజ్ రాగానే అలా హ్యాండ్ ఇచ్చేసే సుందరాంగులకు తక్కువేమీ ఉండదు. వీరిలో రిచా గంగోపాధ్యాయ గురించి చెప్పుకోవాలి. అమెరికాలో పెరిగిన ఈ బెంగాల భామకు.. తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడింది. మిరపకాయ్.. మిర్చి వంటి హిట్ సినిమాలు కూడా చేసింది. అయితే.. స్టార్ స్టేటస్ కు దగ్గరగా వస్తోందనే టైంలో.. ఎడ్యుకేషన్ అంటూ ఎంచక్కా జారుకుంది ఈ బ్యూటీ.
ఇప్పుడు అను ఇమాన్యుయేల్ కూడా ఇలాగే చేస్తుందా అనే డౌట్స్ వస్తున్నాయి. చదువుకునే సమయంలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇఛ్చి.. సెలవల్లో సినిమాలు చేసిన ఈమెకు.. టాలీవుడ్ రెడ్ కార్పెట్ వేసేసింది. రెండో సినిమానే పవన్ కళ్యాణ్ తో చేసే అవకాశం దక్కించుకుంది. ఈమె కూడా అమెరికా సుందరాంగే. కాకపోతే కేరళ నుంచి ఇంపోర్ట్ అయింది అంతే. అను కూడా రిచా మాదిరిగానే సడెన్ గా జంప్ ఇచ్చే ఛాన్సులు ఉన్నాయని పలువురు చెబుతున్నారు. సో ఫ్యాన్స్.. బీ ప్రిపేర్డ్ గా ఉండండి.