మ‌హ‌మ్మారీ రిలీఫ్ ఇచ్చాకే కాజ‌ల్ రిసెప్ష‌న్

Update: 2020-11-03 13:00 GMT
అందాల చంద‌మామ కాజ‌ల్ చూడ‌చ‌క్క‌ని కుర్రాడిని ప్రేమించి పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. ఫ్యామిలీ ఫ్రెండు కుటుంబంలోని గౌత‌మ్ కిచ్లుకి మ‌న‌సిచ్చిన కాజ‌ల్ త‌న లైఫ్ లోకి ఎంతో ఆనంద‌దాయ‌కంగా అతడిని స్వ‌గ‌తించింది. అక్టోబ‌ర్ 30న ముంబై తాజ్ లో కొద్దిమంది బంధుమిత్రుల స‌మ‌క్షంలో సింపుల్ గా ఈ జంట వివాహం జ‌రిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్ప‌టికే వైర‌ల్ గా మారాయి. ఇక భ‌ర్త తో కాజ‌ల్ జ‌త‌గా ఉన్న ఫోటోలు అంత‌ర్జాలంలో హీట్ పెంచుతున్నాయి.

అయితే ఈ పెళ్లికి ఇండ‌స్ట్రీ స్నేహితులు కొలీగ్స్ ఎవ‌రికీ ఆహ్వానం లేదు. కేవ‌లం ఇరు కుటుంబాల‌ నుండి .. బంధుమిత్రులు.. సన్నిహితులను మాత్ర‌మే ఆహ్వానించారు. కోవిడ్ నియ‌మ‌నిబంధ‌న‌ల వ‌ల్ల‌ భద్రత గురించి ఎక్కువ ఆలోచించారు‌. మహమ్మారి నిబంధనల కారణంగా ఇండ‌స్ట్రీ స్నేహితులను ఆహ్వానించలేదు. అందుకే దక్షిణాది నుంచి ఆమె పెళ్లికి హాజరైన ప్రముఖులు ఎవరూ లేరు. అయితే వివాహ రిసెప్ష‌న్ మాత్రం చాలా గ్రాండ్ గా ప్లాన్ చేయాల‌నుకుంటోంద‌ట‌.

అంతేకాదు మ‌హ‌మ్మారీ రిలీఫ్ ఇచ్చేవ‌ర‌కూ వేచి చూడాల‌నుకుంటున్నార‌ట‌. కాజల్ అగర్వాల్ వచ్చే ఏడాది రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి ఇండ‌స్ట్రీ స్నేహితులంద‌రినీ ఆహ్వానించ‌నుంది. ముఖ్యంగా సౌత్ నుండి రిసెప్షన్ కోసం పేరుపేరునా ప్ర‌తి ఒక్క‌రినీ ఆహ్వానించాల‌న్న‌ది ప్లాన్.

వీరంద‌రికీ ప్ర‌త్యేకంగా దిల్లీలో తయారు చేసిన అందమైన హంపర్లను పంపిస్తార‌ట‌. ఈ విష‌యాన్ని కాజ‌ల్ వివాహ ఈవెంట్ డిజైనర్ అంబికా గుప్తా తెలిపారు. ఇది ఒక అంద‌మైన జ్ఞాప‌కం. ఇలా చేస్తే తన పెళ్లికి వారిని ఎందుకు ఆహ్వానించలేదో అందరికీ అర్థమవుతుందని భావిస్తున్నార‌ట‌. అలాగే కాజ‌ల్ తెలుగు అభిమానుల కోసం తెలుగు సాంప్ర‌దాయాన్ని త‌న తమిళ ఫ్యాన్స్ కోసం త‌మిళ సాంప్ర‌దాయాన్ని గౌర‌వించి పెళ్లిలో ఆచ‌రించారు.

తెలుగు స్టైల్ జీలకర బెల్లం కర్మను పాటించేలా చూసుకోవ‌డ‌మే గాక‌..  వివాహ వేడుకల సందర్భంగా దక్షిణ భారత వీవ్స్  వెదురుతో నేసిన పెటిస్ బుట్ట‌లు కంటైన‌ర్ల‌ రూపంలో తమిళనాడుకు కనెక్ట్ అయ్యేలా ఆమె డిజైనర్ చూసుకున్నారు. మొత్తానికి ద‌క్షిణాది సాంప్ర‌దాయానికి ఉత్త‌రాది బ్యూటీ ఇచ్చిన ప్రాధాన్య‌త స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇక తెలుగు.. త‌మిళ ఫిలిం కొలీగ్స్ అంద‌రికీ స్పెష‌ల్ విందును కూడా ప్లాన్ చేస్తోంది కాస్త తాపీగా.
Tags:    

Similar News