షార్ట్ ఫిలిమ్స్ చూసేవారికి చాందిని చౌదరి పేరు తెలిసే ఉంటుంది. ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకున్న చాందిని కొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటించింది. 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'.. 'హౌరా బ్రిడ్జ్'.. 'మను' లాంటి సినిమాల్లో నటించింది చాందిని. అయితే టాలీవుడ్ లో మంచి ఆఫర్లకోసం.. బిగ్ బ్రేక్ కోసం ఎదురు చూస్తూ ఉంది. ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన ఫోటో షూట్లకు సంబంధించిన ఫోటోలు.. ఇతర అప్డేట్లతో నిత్యం అభిమానులతో టచ్ లో ఉంటుంది.
తాజాగా చాందిని తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా లేటెస్ట్ ఫోటో షూట్ కు సంబంధించిన ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటో షూట్ లో చాందిని అందాన్ని తన కెమెరాలో బంధించిన ఫోటో గ్రాఫర్ శక్తి స్మరణ్. ఈ ఫోటోకు "దాదాపు. ఇది నాకో పెద్ద పదం. నేను అది అన్ని చోట్ల ఫీల్ అవుతున్నాను. దాదాపు సంతోషంగా ఉన్నా. దాదాపు మారిపోయా. దాదాపుగా.. పూర్తిగా కాదు. త్వరలో అలా అవుతానేమో- జోన్ బార్. అమెరికన్ రచయిత్రి జోన్ బార్ రాసిన 'ఆల్మోస్ట్ హోమ్' అనే పుస్తకంలో ఇదో పాపులర్ కొటేషన్. సరే ఈ కొటేషన్ సంగతి పక్కన పెడితే ఫోటోలో చాందిని చాలా అందంగా ఉంది. రెడ్ కలర్ స్లీవ్ లెస్ గౌన్ లో వీలైనంత గ్లామర్ ఒలికిస్తూ హాట్ లేడీ ట్యాగ్ కు దాదాపుగా దగ్గరగా ఉంది. రెడ్ కలర్ లిప్ స్టిక్.. డ్రెస్ కు తగ్గట్టు హెయిర్ స్టైల్..ఒక సెన్సిబుల్ ఎక్స్ ప్రెషన్ తో ఫోటోను దాదాపు హాట్ గా మార్చేసింది.
ఈ ఫోటోలకు నెటిజనుల స్పందన కూడా పాజిటివ్ గా ఉంది. "ఫస్ట్ టైమ్ ఇంత హాట్".. "రెడ్ హాట్ కాదు.. అంతకు మించి".. "క్యూట్ హాట్ బ్యూటిఫుల్" అంటూ కామెంట్లు పెట్టారు. చాందిని లాస్ట్ ఫిలిం 'మను'.. ఫణింద్ర నర్సెట్టి దర్శకత్వంలో బ్రహ్మానందం తనయుడు రాజా గౌతం హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఆ సినిమా తర్వాత చాందిని నటించే కొత్త సినిమా ప్రకటన ఇంకా రాలేదు.