కొత్తగా ప్రేమని పరిచయం చేశాడట

Update: 2016-04-17 04:51 GMT
రైటర్స్ లో ఒక్కోళ్లదీ ఒక్కో స్టైల్. పంచ్ లు - ప్రాసలు వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. కానీ పాటల రచయితల సంగతి అలాక్కాదు. అప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన ట్యూన్ ని బేస్ చేసుకుని, సిట్యుయేషన్ కి అనుగుణంగా పాట రాయాలి. ఇప్పుడు పాటకు అనుగుణంగా ట్యూన్ కట్టే రోజులు పోయాయి. కానీ రచయిత చంద్రబోస్ రాసిన కొన్ని పాటల కోసం మాత్రం దిగ్గజ సంగీత దర్శకులు కూడా ట్యూన్ మార్చుకోవడం విశేషం.

రీసెంట్ గా విడుదలైన 24 మూవీ పాటల్లో 'కనుల కలము రాసుకున్న ప్రేమలేఖ మనదిలే' అనే పాటకు ఆడియన్స్ నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. మొత్తం ఆల్బం తనే రాసినా.. ఈ పాటను తాను ఫీలై రాశానంటున్నాడు చంద్రబోస్. ఇప్పుడూ అదే ప్రేమ అయినా.. కొత్తగా పరిచయం చేస్తేనే థ్రిల్ ఉంటుందంటున్నాడీ లిరిక్ రైటర్.

గతంలో నాని చిత్రం కోసం 'పెదవే పలికిన' పాట కోసం రెహమాన్ తన ట్యూన్ ని మార్చుకున్నాడట. ముందు ట్యూన్ ఇచ్చాకే సాంగ్ రాసినా.. మరింత వేగంగా ఉంటే బాగుంటుందని, పాడి వినిపించాడట చంద్రబోస్. అది నచ్చడంతో.. తన ట్యూన్ ని ఏఆర్ రెహమాన్ మార్చుకున్నాడని, రచయితకి స్వేచ్ఛనిచ్చే కంపోజర్ రెహమాన్ అంటున్నాడు చంద్రబోస్.
Tags:    

Similar News