ఏ సినిమా ఎలా ఆడుతుందో చెప్పడం కష్టం. కొన్నిసార్లు మంచి సినిమాలు కూడా పోతాయి. కొన్ని సినిమాలు చెత్త సినిమాలు కూడా ఆడేస్తాయి. గతంతో పోలిస్తే కొత్తదనం ఉన్న సినిమాల్ని తెలుగులో బాగా ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రశేఖర్ యేలేటి సినిమా ‘మనమంతా’ మంచి విజయం సాధిస్తుందనుకున్నారంతా. పైగా ఈ సినిమాకు చాలా మంచి టాక్ కూడా రావడంతో యేలేటి తన కెరీర్లో తొలి కమర్షియల్ సక్సెస్ అందుకోబోతున్నాడని చర్చ జరిగింది. కానీ తీరా చూస్తే ఈ సినిమా కూడా యేలేటికి మరో నిరాశాజనక ఫలితంగా మిగిలేలా కనిపిస్తోంది. ముందు వారం వచ్చిన ‘పెళ్లిచూపులు’ సినిమా ఇరగాడేస్తుంటే.. ‘మనమంతా’కు మాత్రం కలెక్షన్లు పెద్దగా లేవు. దీనికి పోటీగా వచ్చిన ‘శ్రీరస్తు శుభమస్తు’ మాత్రం బాగానే ఆడుతోంది.
మంచి సినిమా తీసినా.. దాన్ని సరిగా ప్రమోట్ చేయకపోవడం ‘మనమంతా’కు మైనస్ అయింది. అసలే నటీనటులు ఇక్కడి వాళ్లు కాదంటే.. కనీసం వాళ్లు వచ్చి ప్రచారం కూడా చేయలేదు. విచారకరమైన విషయం ఏంటంటే.. మోహన్ లాల్, గౌతమి నటించడంతో ఇదేదో డబ్బింగ్ సినిమా అన్న ఫీలింగ్ లో ఉన్నారు జనాలు. స్వయంగా దర్శకుడు చంద్రశేఖర్ యేలేటే ఈ విషయం చెప్పాడు. తనతో చాలామంది ఈ విషయం చెప్పారన్నాడు. మన హీరోలైతే తక్కువ నిడివి ఉన్న పాత్ర చేయరన్న ఉద్దేశంతో.. మోహన్ లాల్ చేస్తే తమిళం, మలయాళ భాషల్లోనూ రీచ్ ఉంటుందని భావించి ఆయన్ని ఎంచుకున్నట్లు యేలేటి చెబుతున్నాడు. ఐతే ఆ భాషల సంగతేమో కానీ.. తెలుగులోనే దీనికి సరైన కలెక్షన్లు లేవు.
గొప్ప సినిమా అని.. హృదయాన్ని హత్తుకుంటుందని అంటుంటే ఇదేదో సెంటిమెంటు సినిమా అని.. ఆర్ట్ సినిమా టైపులో ఉంటుందని జనాలు తప్పుగా అనుకుంటున్నారంటూ రాజమౌళి అన్న మాటలు వాస్తవమే అనిపిస్తోంది పరిస్థితి చూస్తుంటే. ఇలాంటి వైవిధ్యమైన.. మంచి సినిమాల్ని ఆదరించి.. యేలేటి లాంటి గొప్ప దర్శకుల్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత తెలుగు ప్రేక్షకులపై ఉంది. మరి ఆ ప్రేక్షకులు చివరికి ఈ సినిమాకు ఎలాంటి ఫలితాన్ని కట్టబెడతారో చూడాలి.