ఒంటరి మహిళను.. కనీసం ఇల్లు అద్దెకు ఇవ్వలేదు.. నటి ఆవేదన!
విడాకుల సమయంలో ముంబైలో నివసించడానికి సరైన ఇంటిని కల్కి కొచ్లిన్ కనుగొనలేకపోయింది. ఒంటరి మహిళగా ఉన్న నాకు ముంబైలో అద్దెకు ఎవరూ ఇల్లు ఇవ్వలేదు.
ఒక పెద్ద దర్శకుడిని పెళ్లాడి.. ఆ తర్వాత కొన్నేళ్లకే అతడి నుంచి విడిపోయాక.. సదరు విదేశీ బ్యూటీ కం నటికి అసలు కష్టాలు మొదలయ్యాయి. ముంబైలో ఒంటరి తల్లికి కనీసం అద్దెకు ఇల్లు ఇచ్చేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదట. ఒంటరి మహిళగా తనకు ఇల్లు అద్దెకు ఇవ్వడానికి ఎవరూ ఇష్టపడకపోవడమే తనను చాలా ఇబ్బంది పెట్టిందని తెలిపింది. ఇంతకీ ఎవరీ భామ? అంటే.. కల్కి కొచ్లిన్. దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఒంటరి మహిళగా తాను ఎంతగా కష్టపడిందో చెప్పుకొచ్చింది కల్కి కొచ్లిన్.
'ఆఫ్టర్ అవర్స్ విత్ ఆల్ అబౌట్ ఈవ్' యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కల్కీ తన వృత్తిపరమైన జీవితం ఎదిగే క్రమంలో వ్యక్తిగతంగా తాను ఎలా కష్టపడిందో గుర్తుచేసుకున్నారు. నేను - అనురాగ్ విడాకులు తీసుకున్నప్పుడు జిందగీ నా మిలేగీ దోబారా, యే జవానీ హై దీవానీ విడుదలయ్యాయి. అదే సమయంలో ఈ విడాకుల వ్యవహారం నడుస్తోంది అని చెప్పింది. కల్కి - అనురాగ్ 2011లో వివాహం చేసుకున్నారు. 2013 చివరలో విడిపోయారు. విడాకుల సమయంలో ముంబైలో నివసించడానికి సరైన ఇంటిని కల్కి కొచ్లిన్ కనుగొనలేకపోయింది. ఒంటరి మహిళగా ఉన్న నాకు ముంబైలో అద్దెకు ఎవరూ ఇల్లు ఇవ్వలేదు. నాకు చాలా పేరుంది.. నాతో సెల్ఫీలు తీసుకోవాలనుకున్నారు.. కానీ ఇల్లు ఇవ్వరు! అని నాటి వ్యథను గుర్తు చేసుకుంది.
కల్కి 2008లో అనురాగ్ బసు తెరకెక్కించిన 'దేవ్.డి'తో నటనా రంగ ప్రవేశం చేసింది. ఇద్దరూ వెంటనే డేటింగ్ ప్రారంభించారు. 2011లో పెళ్లి చేసుకుని 2013లో విడిపోయారు. ఆ తర్వాత విదేశీ బోయ్ ఫ్రెండ్ తో కల్కి కొచ్లిన్ 2019లో గర్భాన్ని ధృవీకరించారు. వారి కుమార్తె ఫిబ్రవరి 2020లో జన్మించింది. విడాకులు తీసుకున్నప్పటికీ తన వ్యక్తిగత జీవితాన్ని చాలా అరుదుగా బహిరంగ వేదికలపై ప్రస్తావించింది కల్కి. ఈమె చివరిగా 2023 నెట్‌ఫ్లిక్స్ చిత్రం ఖో గయే హమ్ కహాన్‌లో సహాయక పాత్రలో తెరపై కనిపించారు. అదే సంవత్సరం సామ్ బహదూర్‌లో స్పెషల్ నంబర్ కూడా చేసారు.