నాగార్జున‌తో ఏలేటి?

Update: 2016-08-14 08:17 GMT
మ‌న‌మంతా సినిమాతో మ‌రోసారి త‌న స‌త్తా చాటిన ద‌ర్శ‌కుడు చంద్ర‌శేఖ‌ర్ యేలేటి. స్క్రీన్‌ ప్లేలో ఆయ‌న్ని మించిన ద‌ర్శ‌కుడు తెలుగు ఇండ‌స్ట్రీలో మ‌రొక‌రు లేరంటున్నారు మ‌నమంతా చూసిన‌వాళ్లు. నిజంగానే ఆ సినిమాని అంత గ్రిప్పింగ్‌ గా తెర‌కెక్కించాడు. వారాహి చ‌ల‌న చిత్ర సంస్థ స‌రైన రీతిలో ప్ర‌మోష‌న్ చేసుకోవ‌ట్లేదు కానీ.. ఆ సినిమాది ఓ ప్ర‌త్యేక‌మైన స్థాయి అని చెప్పొచ్చు. త‌మిళం - మ‌ల‌యాళం భాష‌ల్లో మ‌నమంతాని చూసిన‌వాళ్లంతా స్టాండింగ్ ఓవేష‌న్ ఇస్తున్నార‌ట‌. తెలుగులోనూ ఆ సినిమాని చూసిన‌వాళ్లంతా బాగుందంటున్న‌వాళ్లే త‌ప్ప బాగోలేదని ఎవ్వ‌రూ అన‌డం లేదు. కానీ వ‌సూళ్లే ఎంత‌కీ పెర‌గ‌డం లేదు.

ఇండ‌స్ట్రీ మాత్రం ఆ సినిమాని ఓ క‌ళాఖండంగా చూస్తోంది. క‌థానాయ‌కులంతా చంద్ర‌శేక‌ర్ యేలేటి త‌మ‌కోసం క‌థ‌ని సిద్ధం చేస్తే ఏమాత్రం ఆలోచించ‌కుండా న‌టించ‌డానికి ఒప్పుకోవాల‌ని డిసైడ్ అయ్యారు. అయితే ఏలేటి మాత్రం నాగార్జున‌తో ఓ సినిమా చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాడు. తాను త‌యారు చేసుకొన్న ఓ క‌థ నాగ్‌ కి త‌గ్గ‌ట్టుగా ఉంద‌ట‌. అది విన్న వెంట‌నే మ‌రో ఆలోచ‌న లేకుండా సినిమా చేస్తాన‌ని నాగ్ ఒప్పుకొన్న‌ట్టు తెలిసింది. దానికితోడు మ‌న‌మంతా సినిమా గురించి ఆయ‌న్ని ప్ర‌త్యేకంగా అభినందించాడ‌ట‌. త్వ‌ర‌లోనే నాగ్‌ - యేలేటి సినిమా గురించి ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశాలున్న‌ట్టు ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ప్ర‌స్తుతం నాగ్ రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో ఓం న‌మో వేంక‌టేశాయ చేస్తున్నారు.
Tags:    

Similar News