ఇది ఒక అరుదైన విషయం. సినిమా రంగం గురించి ఎక్కడయినా చర్చ వస్తుంది గాని శాస్త్ర పరిశోధక రంగంలో ఆ ఊసు తక్కువే. అలాంటిది ఒక సినిమా పేరును ప్రపంచంలోనే ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో ఒక చోట వినియోగించారు. వివిధ దేశాలు ఖగోళంలోకి ఉపగ్రహాలను పంపడానికి వాహకాలను వాడతాయి. ఒక్కసారి కక్ష్యలోకి వెళ్లాక వాహకాలతో పని ఉండదు. అక్కడికి తీసుకెళ్లే వరకే ఆ వాహకాల అవసరం ఉంటుంది. అయినా కూడా వాటి ప్రాధాన్యత లెక్కించలేనిది. తాజాగా చంద్రయాన్ 2 ను ప్రయోగించారు. ఇది విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ చంద్రయాన్ 2 ఉపగ్రహాన్ని తీసుకెళ్లిన వాహకం పేరు ఏంటో తెలుసా?.... ’’బాహుబలి‘‘
ఒక శాటిలైట్ వాహకానికి మన తెలుగు సినిమా పేరు పెట్టారు. ఈ విషయాన్ని ప్రభాస్, బాహుబలి సినిమా పేజీ తమ సోషల్ మీడియా అక్కౌంట్లలో గర్వంగా ప్రకటించాయి. నిజానికి ఇది తెలుగు సినిమాకు దక్కిన అరుదైన గౌరవంగా చెప్పుకోవచ్చు. ప్రభాస్ ఏమన్నారంటే...
``హలో డార్లింగ్స్, చంద్రయాన్ 2 ప్రయోగం విజయవంతంగా కావడం పట్ల యావత్ భారతీయులు గర్వపడుతున్నారు. చంద్రయాన్2ను క్షక్ష్యలోకి ప్రవేశపెట్టిన వాహకానికి బాహుబలి అనే పేరు పెట్టడం గౌరవంగా భావిస్తున్నాను. 300 వందల టన్నుల బరువైన చంద్రయాన్ 2ను ప్రయోగించడం వెనుక ఎన్నో ఏళ్ల కృషి ఉంది`` అని ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు.
బాహుబలి అఫిషియల్ పేజీలో... బాహుబలి నిర్మాతలు కూడా దీని గురించి ట్వీట్ చేశారు. ’చంద్రయాన్ 2 వంటి గొప్ప ప్రయోగంలో మా సినిమా పేరు వాడుకున్నందుకు గర్వపడుతున్నాం. అంతేకాదు, బహుళ ప్రయోజనకారి అయిన చంద్రయాన్ 2 విజయవంతంగా నింగిలో ప్రవేశపెట్టిన ఇస్రోకు ఈ సందర్భంగా ఘనమైన శుభాకాంక్షలు తెలుపుతున్నాం‘‘ అని పేర్కొన్నారు. ఈ క్రెడిట్ ఇచ్చినందుకు ఇస్రోకు కృతజ్జతలు తెలిపారు.
ఈ బాహుబలి వాహకం టెక్నికల్ నేమ్ ’’జీఎస్ ఎల్ వీ మార్క్ 3 ఎం 1‘‘. ప్రభాస్ నటించిన చిత్రం `బాహుబలి`దేశంలో నెం.1 చిత్రంగా నిలిచింది. ఇప్పటికీ దీని రికార్డులు చెరిగిపోలేదు. త్వరలో ప్రభాస్ మరో పెద్ద ప్రాజెక్టు ’సాహో‘ లో నటించారు. ఇది వచ్చే నెల 30వ తేదీన విడుదల కానుంది.