టాలెంటెడ్ డైరెక్టర్ చందూ మొండేటి 'కార్తికేయ' వంటి సూపర్ హిట్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఆ తర్వాత 'ప్రేమమ్' మూవీతో మరో బ్లాక్ బస్టర్ అందుకొని క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు. 'సవ్యసాచి' సినిమాతో ప్లాప్ రుచి చూసిన చందూ.. 'సూర్య vs సూర్య' 'కిరాక్ పార్టీ' వంటి చిత్రాలకు రచయితగానూ వర్క్ చేశాడు. 'బ్లడీ మేరీ' సినిమాతో ఓటీటీలోనూ అడుగుపెట్టాడు. ఇప్పుడు "కార్తికేయ 2" చిత్రంతో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నాడు.
నిఖిల్ సిద్దార్థ్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ "కార్తికేయ 2". దర్శక హీరోల కాంబినేషన్ లో రూపొందిన 'కార్తికేయ' కు ఇది సీక్వెల్. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రానికి అన్ని భాషల్లోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా హిందీ బెల్ట్ లో అతిపెద్ద విజయం సాధించింది.
నార్త్ లో ఫస్ట్ డే కేవలం 50 స్క్రీన్‌లలో మాత్రమే విడుదలైన 'కార్తికేయ 2'.. మౌత్ టాక్ తో రోజురోజుకూ వాటి సంఖ్య పెంచుకుంటూ పోయింది. ఇప్పటివరకు హిందీలో రూ. 28 6 కోట్లకు పైగా వసూలు చేసి 30 కోట్ల దిశగా దూసుకుపోతోంది. వరల్డ్ వైడ్ గా రూ. 115 కోట్లకు పైగా కలెక్ట్ చేసి భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
'కార్తికేయ 2' సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో ఇప్పుడు అభిమానులు ఇప్పుడు చందూ మొండేటి ని సరికొత్త పాన్ ఇండియా డైరెక్టర్ గా పేర్కొంటున్నారు. వంద కోట్ల దర్శకుడు అయ్యాక పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ నుంచి ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది.
చందూ ఇప్పటికే గీతా ఆర్ట్స్ లో ఓ మూవీ కమిట్ అయ్యున్నారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ని లైన్ లోకి తీసుకురాడానికి సన్నాహాలు జరుగుతున్నాయని టాక్.. హీరో ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది.
ఇదిలా ఉంటే ఒక్క సినిమాతోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన చందూ కోసం బాలీవుడ్ నిర్మాతలు క్యూ కడుతున్నారని తెలుస్తోంది. క్రేజీ ఆఫర్స్ తో దర్శకుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఇప్పటికే బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ తో సహా మరో ఇద్దరు హీరోలను చందూ మొండేటి కలిసినట్లు సమాచారం. త్వరలో అతని బాలీవుడ్ డెబ్యూ ప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.