క్యాస్టింగ్ కౌచ్ ఇటీవల దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీని కారణంగా చాలా మంది జీవితాలు నాశనం అయ్యాయని, కొంత మంది కెరీర్ ని వదుతుకున్నారని బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు పలువురు హీరోయిన్ లు సంచలన వ్యాఖ్యలు చేశారు. గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి క్యాస్టింగ్ కౌచ్ పై సోషల్ మీడియా వేదికగా యుద్ధమే చేసింది. ఏకంగా తమిళ చిత్ర సీమలో పేరుమోసిన రచయిత వైరముత్తు క్యాస్టింగ్ కౌచ్ కు పాల్పడుతున్నాడని, ఎంతో మంది సింగర్ ల జీవితాలని నాశనం చేశాడని బాహాటంగానే విమర్శలు చేసి సంచలనం సృష్టించింది.
ఆ తరువాత నటుడు రాధా రవిపై కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేసి డబ్బింగ్ కళాకారుల సంఘం నుంచి బలవంతంగా తొలగించబడింది. ఈ వివాదం ప్రస్తుతం సద్దుమనిగింది. అయితే తాజాగా టాలీవుడ్ కు చెందిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి క్యాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిందంటూ నెట్టింట ఓ న్యూస్ వైరల్ గా మారింది. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తాజా వ్యాఖ్యలు చేశారంటూ ఓ న్యూస్ నెట్టింట స్ప్రెడ్ కావడం చర్చనీయాంశంగా మారింది.
తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అమ్మ, అత్త పాత్రల్లో నటిస్తూ బిజీగా వున్న ప్రగతి ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయటపెట్టిందని ప్రచారం జరుగుతోంది. కెరీర్ ప్రారంభంలో తను కూడా ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నానని, అవకాశాల కోసం దర్శక నిర్మాతలే కాకుండా ఓ హీరో కూడా తనని వేధించాడని ఆమె చెప్పినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలో అవకాశం కావాలంటే రోజంతా తనతో గడపమని దర్శక నిర్మాతలతో పాటు ఓ హీరో తనని ఇబ్బందులకు గురిచేశాడని ప్రగతి చెప్పిందని ప్రచారం జరుగుతోంది.
తన లాగే కెరీర్ ప్రారంభంలో చాలా మంది మహిళా కళాకారులు క్యాస్టింగ్ కౌచ్ కి గురవుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అయితే అవకాశాల ముసుగులో ప్రలోభాలకు లొంగితే మన జీవితమే నాశనం అవుతుందని, టాలెంట్ వుంటే ఆఫర్లు అవే మనల్ని వెతుక్కుంటూ వస్తాయని ఆమె తెలిపిందని, చెబుతున్నారు.
అయితే ఇందులో నిజా నిజాలేంటన్నది తెలియాల్సి వుంది. నిజంగా ఈ వ్యాఖ్యలు ఆమె చేసిందా? లేక ఎవరైనా ప్రచారం చేస్తున్నారా? అని క్లారిటీ రావాల్సి వుంది. ప్రస్తుతం ప్రగతి తెలుగులో `ఎఫ్ 3, భోళా శంకర్ .. తమిళంలో `భగీరా` చిత్రాల్లో నటిస్తోంది.