చ‌ర‌ణ్ - ఉపాస‌న కోసం క‌దిలిన టాలీవుడ్!

Update: 2022-06-15 06:38 GMT
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్-ఉపాస‌న దంప‌తుల 10 వ వివాహ వార్సికోత్స‌వం  జూన్ 14న ఘ‌నంగా సెల‌బ్రేట్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ప‌దేళ్ల పెళ్లి ప్ర‌యాణాన్ని ప్ర‌త్యేకంగా సెల‌బ్రేట్ చేసుకోవ‌డం ఇట‌లీలో ప్లాన్ చేసారు. నిన్న‌టి రోజున ఇట‌లీలోని ప్లోలెర్స్  లో ఘ‌నంగా జంట వేడుక‌లు నిర్వ‌హించింది. ముందుగా తెలుపు రంగు దుస్తుల్లో ఒక‌ర్ని ఒక‌రు ప్ర‌పోజ్ చేసుకుంటోన్న కొన్ని ఫోటోలు లీక్ చేసారు.

అందులో జంట ఎంతో అందంగా క‌నిపించింది. చుట్టూ అంద‌మైన గ్రీన‌రీ మధ్య‌లో జంట మ‌రెంతో అందంగా క‌న‌పించింది. తాజాగా ఉపాస‌న‌-చ‌ర‌ణ వింటేజ్   రాయ‌ల్ లుక లో మ‌రంత ఆక‌ర్ష‌ణీయంగా క‌నబ‌డుతోన్న ఫోటోని  ఇన్ స్టా వేద‌క‌గా అభ‌మానుల‌కు షేర్ చేసారు.  పాత‌కాల‌పు యువ‌రాజు-యువ‌రాణి రాయ‌ల్ లుక్ లో ఎంతో అందంగా డిజైన‌ర్ దుస్తుల్లో క‌నిపిస్తున్నారు.

చ‌ర‌ణ్ వైట్ క‌ల‌ర్ ష‌ర్ట్  పై గ‌ళ్ల డిజైన్ షూట్ ధ‌రించ‌గా..మ్యాచింగ్  బ్రౌన్ క‌ల‌ర్  ప్యాంట్ లో  క‌ళ్ల‌కి  గ్లాసెస్ ధ‌రించి మ‌నోహారంగా క‌నిపిస్తున్నారు. ఇక ఉపాస‌న గ్రీన్ క‌ల‌ర్ దుస్తులు ధ‌రించి  చ‌ర‌ణ్ చేయి ప‌ట్టుకుని  స‌ఖుడితో  అలా న‌డుచుకుంటూ వ‌స్తోన్న వైనం ఎంతో అందంగా క‌నిపిస్తుంది.  ప‌దేళ్ల దాంప‌త్య జీవితంలో ఏనాడు ఇంత వైభంగా వాహ‌వా ర్షికోత్సవాన్ని ఇంత ఘ‌నంగా నిర్వ‌హించ‌లేదు.

ప‌దేళ్ల వివాహ బంధాన్నిగొప్ప‌గా  చాటి చెప్పాల‌నే ఈ ఏడాదితో ఇంత ఘ‌నంగా  ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తుంది. ఇక  ఈ దంప‌తులకు  ప‌లువురు   టాలీవుడ్ సెల‌బ్రిటీలు ప్ర‌త్యేకంగా శుభాకాంక్ష‌లు తెలియ‌జేసారు.

ఉపాస‌న  స్నేహితురాలు..మ‌హేష్ స‌తీమ‌ణి న‌మ్ర‌త శిరోద్క‌ర్ ఇద్ద‌రికీ విషెస్ తెలియ‌జేసింది.  ''ఆ దేవుడు ఆశిస్సులు ఎల్లప్పుడూజీల‌ను ఉండాల‌ని  ప్రార్ధించారు. నాలుగు ల‌వ్ ఎమోజీల‌ను  పోస్ట్  చేసి  త‌న మ‌నసులో  కోర్కెని సైతం. ఎమోజీల రూపంలో బ‌య‌ట‌ పెట్టారు.

ఇక వ‌రుణ్  తేజ్  మూడు హార్ట్ ఎమోజీల‌ను పోస్ట్ చేసి విష్ చేసారు. ఇంకా  కాజ‌ల్ అగ‌ర్వాల్..స‌మంత‌..క‌నికా కపూర్..సానియా మీర్జా  విషెస్  తెలియ‌జేసారు.  జీవితంలో ఎన్నోవెలుగులు నిండిపోవాల‌ని..ఎల్ల‌ప్పుడూ ఇలాగే న‌వ్వుతూ ఉండాల‌ని కాజ‌ల్ ఆకాంక్షించారు.  ప్ర‌స్తుతం  ఈ ఫోటో..కామెంట్లు నెట్టింట వైర‌ల్ గా మారాయి.  మెగా అభిమానులు  సోష‌ల్ మీడియా వేదిక‌గా దంప‌తుల‌కు విషెస్ తెలియ‌జేస్తున్నారు.
Tags:    

Similar News