చరణ్ టు ఎన్టీఆర్.. కొరటాల శివ అదిరిపోయే ట్విస్ట్..!

Update: 2022-11-15 01:30 GMT
RRR రిలీజ్ కి ముందే ఎన్.టి.ఆర్ తో కొరటాల శివ సినిమా ఫిక్స్ చేసుకున్నారు. ఓ పక్క ఆచార్య మూవీ చేస్తూ మరోపక్క ఎన్.టి.ఆర్ కోసం ఒక సూపర్ స్టోరీ సిద్ధం చేశాడు. ఆర్.ఆర్.ఆర్ బ్లాక్ బస్టర్ అందుకోగా ఎన్.టి.ఆర్ 30ని కూడా పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేశారు. అయితే ఆచార్య వల్ల కొరటాల శివ కెరియర్ లో ఒక బ్లాక్ మార్క్ పడ్డది. ఆ ఎఫెక్ట్ ఎన్.టి.ఆర్ సినిమా మీద పడ కూడదు అని కథని చెక్కుతూనే ఉన్నారు. ఎన్.టి.ఆర్ తో తెరకెక్కించబోతున్న ఈ మూవీ కొరటాల శివ రాం చరణ్ కోసం రాసుకున్నాడట.   

చరణ్ తో సినిమా ప్రయత్నాల్లో ఉండగా ఈ కథతో పాటుగా ఆచార్య స్టోరీ కూడా చెప్పాడట. ఆచార్య కథ చిరుకి సూట్ అవుతుందని అనుకుని ఈ స్టోరీని పక్కన పెట్టాడట చరణ్. ఆచార్యలో కూడా చరణ్ కి ఒక రోల్ ఇచ్చారు.

సో ఇప్పుడు చరణ్ కి చెప్పిన ఆ కథనే మార్పులు చేసి ఎన్.టి.ఆర్ తో పాన్ ఇండియా మూవీ చేస్తున్నారట కొరటాల శివ. సో చరణ్ నుంచి తారక్ ఈ కథ షిఫ్ట్ అయ్యిందని టాక్. అంతకుముందు రైటర్ గా సక్సెస్ ఫుల్ సినిమాలను ఇచ్చిన కొరటాల శివ మిర్చి సినిమాతో డైరక్టర్ గా మారారు.

మిర్చి టు భరత్ అనే నేను వరకు వరుస హిట్లు అందుకున్న కొరటాల శివ ఆచార్య రిజల్ట్ తో ఎన్నో అవమానాలు ఫేస్ చేశాడు. ఎన్.టి.ఆర్ సినిమా హిట్టు కొట్టి మరోసారి తన స్టామినా ఏంటో చూపించాలని ఫిక్స్ అయ్యాడు కొరటాల శివ.

తన ప్రతి కథలో ఏదో ఒక సోషల్ మెసేజ్ ఇస్తూ వచ్చిన కొరటాల శివ ఎన్.టి.ఆర్ 30 కోసం కూడా అలాంటి ఓ అద్భుతమైన కథ రెడీ చేశారట. ఆచార్య ఫ్లాప్ అయినా సరే కొరటాల శివ మీద ఉన్న నమ్మకంతో ఇలాంటి టైం లో ఆఫర్ ఇచ్చారు ఎన్.టి.ఆర్.

ఆల్రెడీ ఈ ఇద్దరు కలిసి జనతా గ్యారేజ్ సినిమా చేశారు. మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తున్నారు కొరటాల శివ. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీని యువ సుధ ఆర్ట్స్ బ్యానర్ లో మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ ని దించాలని చూస్తున్నారు. ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ పేర్లు ఫైనల్ అయినట్టు టాక్. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీ కోసం ఎన్.టి.ఆర్ కొత్త లుక్ లో కనిపిస్తారని తెలుస్తుంది. లేటెస్ట్ గా ఎన్.టి.ఆర్ న్యూ స్టైలిష్ లుక్ కొరటాల శివ సినిమా కోసమే అని అంటున్నారు.  


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News