డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా ప్రముఖ సినీ నటి చార్మి దర్యాప్తు సమయంలో కలకలం చోటుచేసుకుంది. సిట్ కార్యాలయానికి చేరుకొని విచారణకు వెళుతున్న సమయంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ శ్రీనివాస్ తనతో ఇబ్బందికరంగా ప్రవర్తించినట్లు చార్మి ఫిర్యాదు చేసింది. విచారణకు హాజరయ్యేందుకు వస్తున్న క్రమంలో తనతో శ్రీనివాస్ ప్రవర్తించిన తీరుతో షాక్‌కు గురయినట్లు చార్మి దర్యాప్తు వర్గాలకు వివరించింది. ఈ మేరకు చార్మి అభ్యంతరాన్ని సిట్ వర్గాలు పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం.
సిట్ విచారణకు హాజరయ్యేందుకు లోపలికి వస్తుండగా శ్రీనివాస్ ఓవరాక్షన్ చేస్తూ తనపై చేయి వేశాడని చార్మి ఫిర్యాదులో పేర్కొంది. కాగా, నలుగురు మహిళా అధికారుల బృందం పర్యవేక్షణలో సిట్ అధికారులు చార్మిని విచారిస్తున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు సిట్ అధికారులు చార్మిని ప్రశ్నించనున్నారు. అనుమతి లేనిదే రక్త నమూనాలు - గోళ్లు - వెంట్రుకలు సేకరించబోమని సిట్ అధికారులు హైకోర్టుకి తెలిపిన విషయం తెలిసిందే. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చార్మి విచారణ కొనసాగనుంది.