టాలీవుడ్ యంగ్ హీరో రామ్ - పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన మూవీ ఇస్మార్ట్ శంకర్. గతేడాది జులై 18న విడుదలై మంచి విజయం సొంతం చేసుకుంది. అయితే నేటికీ ఈ సినిమా విడుదలై ఒక సంవత్సరం పూర్తికావడంతో అభిమానులు సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నారు. అయితే ఇస్మార్ట్ శంకర్ నిర్మాతలలో ఒకరైన ఛార్మి మాట్లాడుతూ.. "ప్రస్తుతం కరోనా టైం, అలాగే దేశంలో పలుచోట్ల వరదలు ముంచెత్తుతుండటంతో మేం సెలెబ్రేషన్స్ చేయాలనీ అనుకోవట్లేదు. అలాగే అభిమానులు కూడా సెలెబ్రేషన్స్ మానేసి ప్రభుత్వం చెప్పిన విధంగా జాగ్రత్త వహిస్తూ హ్యాపీగా ఉండండి. ఇస్మార్ట్ విజయం మాకు ఎనర్జీ ఇస్తుందని చెప్పింది.
అలాగే ఈ సినిమాకి ఫస్ట్ అండ్ ఫైనల్ హీరో రామ్ మాత్రమే. అసలు హీరోకి సంబంధించి ఇతర ప్రత్యామ్నాయాలు లేవు. స్క్రిప్ట్ టైంలో రామ్ పూరీతో పాటు గోవాలోనే ఉన్నాడు. ఆ టైంలో నేను ఇతర ప్రీ-ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నాను. ఈ కథను మొదటిసారి విన్నప్పుడే ఇస్మార్ట్ శంకర్ ఇంత భారీ హిట్ అవుతుందని ఊహించాను. "ఇది ఒక భారీ బ్లాక్ బస్టర్ అవుతుందని ప్రతి ఒక్కరికి చెప్తూ వచ్చాను. అలాగే నేను ఏ స్క్రిప్ట్స్‌లో కూడా పాల్గొనను. పూరి స్క్రిప్ట్ పూర్తి చేసిన తర్వాత మొత్తం కథ సీన్ బై సీన్ వివరిస్తాడు. మా టీంలో ఎవరికీ ఏదైనా అనిపిస్తే.. ఎటువంటి సంకోచం లేకుండా చెప్తాం. పూరి అన్ని సలహాలను చాలా సానుకూలంగా తీసుకుంటాడు.
ఇస్మార్ట్ శంకర్ విడుదల అయ్యాక మేం థియేటర్లో చప్పట్లు కొట్టడం, ఈలలు వేయడం చూసాం. అలాగే నా విషయానికి వస్తే.. ఇక పై నేను నటనకు దూరంగా ఉండాలని అనుకుంటున్నా. నటన ఆపేసి సినిమాలను నిర్మించే ఆలోచనలో ఉన్నాను. ఇక ప్రస్తుతం పూరీ లాక్ డౌన్లో 6-7 స్క్రిప్ట్స్ రెడీ చేసాడు. ఇంకో పదేళ్ల వరకు సరిపడే కంటెంట్ రాసి పెట్టాడు. అన్నీ కూడా పూరీ కనెక్ట్స్ నుండి అనౌన్స్ చేస్తాం. అలాగే పూరీ కనెక్ట్స్ ఓటిటి ప్లాట్ ఫామ్ కంటెంట్ కూడా సిద్ధం చేస్తోంది. ఓటిటిలు అనేవి ప్రస్తుతం దర్శక నిర్మాతలకు మంచి హోప్ కలిగిస్తున్నాయి. పూరీ నుండి చాలా కాన్సెప్టులు రానున్నాయి. అలాగే చాలామంది కొత్త డైరెక్టర్స్ పరిచయం కానున్నారు" అని ఛార్మి తెలిపింది. ప్రస్తుతం ఇస్మార్ట్ ఫ్యాన్స్ అంతా సంబరాలలో ఉన్నట్లు తెలుస్తుంది.