చంద్రబాబుపై విరుచుకుపడే సీనియర్ పొలిటీషియన్ చేగొండి హరిరామ జోగయ్య మరోసారి తనదైన శైలిలో విమర్శలు కురిపించారు. ముద్రగడ పద్మనాభం దీక్ష విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్న తీరును ఆయన తప్పుపట్టారు. చంద్రబాబును కాపులు ఎట్టి పరిస్థితిలోనూ క్షమించరని ఆయన అన్నారు. గతంలో టీడీపీ మనుగడకు అడ్డుగా ఉన్నారని వంగవీటి రంగాను హత్య చేశారని.. అందుకు కారణభూతుడు చంద్రబాబేనని ఆరోపించారు. ఇప్పుడు ముద్రగడ విషయంలోనూ అలాగే వ్యవహరిస్తున్నారని.. చంద్రబాబు ఇప్పుడు కూడా అదే తీరు అనుసరిస్తున్నట్లుగా కనిపిస్తోందని జోగయ్య అంటున్నారు.
రంగా హత్య నాటి పరిస్థితులు పునరావృతమైతే చంద్రబాబును కాపులు వదిలిపెట్టరని ఆయన హెచ్చరించారు. అదేసమయంలో ఆయన టీడీపీ మంత్రుల ఆరోపణలనూ తిప్పకొట్టారు. కాపుల్లో అధిక శాతం మంది ముద్రగడ డిమాండును సమర్థిస్తున్నారని అన్నారు. తుని విధ్వంసం పేరుతో కాపులను అరెస్టు చేసి ఆ వర్గంలో భయాందోళనలు రేపుతున్నారని జోగయ్య ఆరోపించారు.
కాగా కొన్ని నెలల కిందట హరిరామ జోగయ్య ఓ పుస్తకం రాశారు. అప్పట్లో సంచలనం రేపిన ఆ పుస్తకంలోనూ ఆయన చంద్రబాబును రంగా హత్యలో కీలక వ్యక్తిగా అభివర్ణించారు. చంద్రబాబు కనుసన్నల్లోనే రంగా హత్య జరిగిందని ఆరోపించారు. అప్పట్లో జోగయ్య రాసిన పుస్తకం తీవ్ర అలజడి రేపింది. చంద్రబాబు కూడా ఉలిక్కి పడ్డారు. ఇప్పుడు మరోసారి జోగయ్య పాత ఆరోపణలు బయటకు తీయడం కలకలం రేపుతోంది.