'ఎన్నై నొక్కి పాయుం తోటా' (తెలుగులో 'తూటా') చిత్రంతో హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ముద్దుగుమ్మ మేఘ ఆకాష్. ఈ విడుదల ఆలస్యమైనా నితిన్ హీరోగా నటించిన 'లై' సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టినప్పటికీ.. వెంటనే నితిన్ తో 'చల్ మోహన్ రంగ' అనే సినిమాలో నటించే అవకాశం అందుకుంది మేఘ. ఇది కూడా నిరాశ పరచడంతో ఈ బ్యూటీ మళ్ళీ చెన్నై కి చెక్కేసింది.
రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన 'పేట' సినిమాలో కీలక పాత్ర పోషించింది మేఘ. ఆ తర్వాత మరో రెండు తమిళ చిత్రాల్లో నటించింది. ఇవేవీ కూడా అమ్మడికి ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టలేదు. నాలుగేళ్ళ తర్వాత రిలీజైన తన ఫస్ట్ సినిమా 'తూటా' కూడా ప్లాప్ అయింది. దీంతో కోలీవుడ్ లో కూడా లాభం లేదనుకుని 'శాటిలైట్ శంకర్' చిత్రంతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ 'రాధే' సినిమాలో కీ రోల్ ప్లే చేసింది. ఈ రెండూ హిందీ పరిశ్రమలో నిలబడటానికి మేఘ కు హెల్ప్ చేయలేదు.
అయితే సరైన సక్సెస్ లేకపోయినా మేఘా ఆకాష్ కు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఎన్ని ప్లాప్స్ వచ్చినా నిరాశ చెందకుండా ఈ బ్యూటీ కష్టపడుతూనే ఉంది. ఈ క్రమంలో 'రాజ రాజ చోర' సినిమాతో మరోసారి టాలీవుడ్ లో లక్ పరీక్షించుకోడానికి రెడీ అయింది. టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు నటించిన ఈ చిత్రం మేఘ కు సూపర్ హిట్ అందించింది. హసిత్ గోలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తో నడుస్తోంది.
కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల తర్వాత విడుదలైన 'రాజ రాజ చోర' చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. మంచి రేటింగ్స్ తెచ్చుకున్న ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. ఇందులో హీరో శ్రీవిష్ణు తో పాటుగా హీరోయిన్ మేఘా ఆకాష్ కు కూడా మంచి పేరు వస్తోంది. తెలుగులో తనకు వచ్చిన ఫస్ట్ సక్సెస్ కు అమ్మడు మురిసిపోతోందని తెలుస్తోంది. ఈ విజయంతో టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు ఈ బ్యూటీ తలుపు తట్టే అవకాశం ఉంది.
తెలుగు ములాలున్న మేఘా ఆకాష్ ప్రస్తుతం 'డియర్ మేఘ' అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఎమోషనల్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే 'గుర్తుందా శీతాకాలం' 'మను చరిత్ర' సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. అంతేకాదు 'అక్టోబర్ 31స్ట్ లేడీస్ నైట్' అనే బైలింగ్వల్ తో పాటుగా విజయ్ సేతుపతి తో ఓ తమిళ్ సినిమా చేస్తోంది మేఘ. ఈ సినిమాలతో ఈ ముద్దుగుమ్మ క్రేజీ హీరోయిన్ గా మారుతుందేమో చూడాలి.