చెన్నకేశవ రెడ్డి రీ రిలీజ్ కలెక్షన్స్.. నిజంగా అంత వచ్చాయా?

Update: 2022-10-10 09:30 GMT
టాలీవుడ్ సినిమా ప్రపంచంలో ఇటీవల కాలంలో కొన్ని సినిమాలు రీ రిలీజ్ అవుతూ ఉండడం హాట్ టాపిక్ గా మారుతుంది. సినిమాల అసలు ఫలితాలతో సంబంధం లేకుండా కూడా సరికొత్త టెక్నాలజీతో అప్డేట్ చేసి మరీ నిర్మాతలు సినిమాలను విడుదల చేస్తున్నారు. ఇక రీసెంట్ గా నందమూరి బాలకృష్ణ నటించిన చెన్నకేశవరెడ్డి సినిమాను కూడా మళ్లీ విడుదల చేశారు. 2002 సెప్టెంబర్ 5వ తేదీన వచ్చిన ఈ సినిమాకు వివి.వినాయక్ దర్శకత్వం వహించగా బెల్లంకొండ సురేష్ నిర్మించారు.

ఇక ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అప్పట్లో పెద్దగా సక్సెస్ కాలేదు. అలాగని అది దారుణంగా నష్టాలను కూడా కలిగించలేదు. అయితే చెన్నకేషవరెడ్డి సినిమాను మళ్లీ విడుదల చేయాలి అని ఫ్యాన్స్ నుంచి వచ్చిన డిమాండ్ మేరకు ఇటీవల నిర్మాత మళ్లీ సరికొత్త టెక్నాలజీతో సినిమా క్వాలిటీని అప్డేట్ చేసి మరి విడుదల చేశారు. ముఖ్యంగా ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాను ఒక మీడియం రేంజ్ సినిమా విడుదలవుతున్నంత రేంజ్ లోనే ప్రదర్శించడం విశేషం.

ఇక ఈ సినిమాకు సంబంధించిన రీ రిలీజ్ కలెక్షన్స్ ఎంత అనే విషయంలో అనేక రకాల పదనాలు వెలువడ్డాయి. ఇక ఫైనల్ గా ఈ విషయంపై నిర్మాత బెల్లంకొండ సురేష్ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. చెన్నకేశవరెడ్డి సినిమా మళ్లీ విడుదల చేయడంతో బాక్సాఫీస్ వద్ద 5.39 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది అని సురేష్ తెలియజేశారు. ఇక ఈ వచ్చిన డబ్బు మొత్తాన్ని కూడా నందమూరి బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కోసం డొనేట్ చేస్తున్నట్లు బెల్లంకొండ సురేష్ క్లారిటీగా తెలియజేశారు.

అయితే ఇంతకు ముందు రీ రిలీజ్ అయిన పోకిరి జల్సా సినిమాల కంటే చెన్నకేశవరెడ్డి అత్యధిక స్థాయిలో కలెక్షన్స్ అందుకున్నట్లు సోషల్ మీడియాలో కూడా ప్రచారాలు జరుగుతున్నాయి. నిజంగా ఈ సినిమా ఆ స్థాయిలో కలెక్ట్ చేసిందా అనేది కూడా మరొక అనుమానాన్ని కలిగిస్తుంది.

ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా షోలకు  పెద్దగా రెస్పాన్స్ ఏమీ రాలేదు. కేవలం మెయిన్ సెంటర్స్ లోనే ఫ్యాన్స్ అందరూ కూడా సినిమాను చూసి ఎంజాయ్ చేశారు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇక సినిమా కలెక్షన్స్ సంగతి పక్కన పెడితే మాత్రం చెన్నకేశవరెడ్డి ఈ రోజుల్లో కూడా బాలయ్య హార్డ్ కోర్ ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News