ఇప్పటికే రెండు మూడుసార్లు వాయిదా పడి.. పోయిన శుక్రవారం థియేటర్లలోకి దిగినట్లే దిగి మళ్లీ విడుదల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంది ‘రాజాధిరాజా’ సినిమా. తొలి రోజు బొమ్మ పడకపోవడంతో ఇక ఈ సినిమా కథ ముగిసినట్లే అని.. ఇక ఎప్పటికీ విడుదల కాదని అనుకున్నారు. కానీ రెండో రోజుకు ఇష్యూ సెటిలైంది. సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఐతే పలుమార్లు వాయిదా పడటం వల్ల.. శుక్రవారం షోలు వేయకపోవడం వల్ల జనాలు అసహనానికి గురై ఈ చిత్రాన్ని పెద్దగా పట్టించుకోలేదు. నిజానికిది మంచి సినిమా. శర్వానంద్-నిత్యామీనన్ లాంటి హిట్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాను సరిగా ప్రమోట్ చేసి.. ఓ పద్ధతి ప్రకారం రిలీజ్ చేసి ఉంటే మంచి ఫలితమే దక్కేది. కానీ మంచి అవకాశాన్ని మిస్సయ్యారు. హీరో శర్వానంద్ కూడా ఈ సినిమాను పట్టించుకోలేదు. దర్శక నిర్మాత చేరన్ డబ్బుల విషయంలో పట్టుదలకు పోయి.. సినిమా వాయిదా పడ్డానికి కారకుడయ్యాడు.
ఐతే ఎలాగోలా సినిమా రిలీజయ్యాక ఇప్పుడొచ్చి.. ‘రాజాధిరాజా’కు తెలుగులో మంచి స్పందన వస్తోందని.. తమిళంలో కూడా ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయాలనుకుంటున్నామని మీడియాతో వెల్లడించాడు. తమిళంలో ‘జేకే యనుం నన్బన్ వాల్కై’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కొన్ని ఇబ్బందుల వల్ల నేరుగా డీవీడీల రూపంలో విడుదల చేశాడు చేరన్. అది జరిగి దాదాపు రెండేళ్లవుతుంది. రెస్పాన్స్ అనుకున్న స్థాయిలో ఏమీ లేదు. ఐతే ఇప్పుడు తీరిగ్గా థియేటర్లలోకి రిలీజ్ చేస్తానంటున్నాడు చేరన్. థియేటర్ల యాజమాన్యాలే ఈ సినిమాను విడుదల చేయడానికి ఆసక్తి చూపించాయని.. త్వరలోనే ‘జేకే..’ను థియేటర్లలోకి తీసుకొస్తామని చేరన్ అంటాడు. ఐతే సినిమా డీవీడీలు అందుబాటులో ఉండి.. టొరెంట్లలో కూడా ఈజీగా దొరికేస్తున్న టైంలో ఇప్పుడు జనాలు థియేటర్లకొచ్చి ఈ సినిమాను చూస్తారా అన్నది డౌటే.