దాన‌య్య‌కు చెర్రీ లిఫ్ట్ ఎందుకు?

Update: 2019-11-04 11:05 GMT
మెగా ఫ్యామిలీ తో దాన‌య్య సాన్నిహిత్యం తెలిసిందే. చిరంజీవి ప్రోత్సాహంతోనే మెగా నిర్మాత‌గా డీవీవీ దాన‌య్య వెలుగులోకి వ‌చ్చాడు. ఆ బాండింగ్ వ‌ల్ల‌నే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో  బ్యాక్ టు బ్యాక్ సినిమాలు నిర్మిస్తున్నారు. అయితే బ్రూస్లీ- విన‌య విధేయ రామ లాంటి భారీ చిత్రాలు భారీగానే న‌ష్టాలు మిగిల్చాయి. ఆ క్ర‌మంలోనే ద‌ర్శ‌కధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళితో భారీ ప్రాజెక్ట్ దాన‌య్య‌లో ఉత్సాహం నింపింది.

ప్రస్తుతం చ‌ర‌ణ్ -ఎన్టీఆర్ క‌థానాయ‌కులుగా న‌టిస్తోన్న ఆర్.ఆర్.ఆర్ చిత్రాన్ని దాన‌య్య భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు. కొమురం భీమ్- అల్లూరి సీతారామ‌రాజు జీవిక‌థ‌ల్లో ఫిక్ష‌న్ జోడించి తీస్తున్న చిత్ర‌మిది. పాన్ ఇండియా కేట‌గిరీలో విడుద‌ల చేయన్నారు. 2020 జూలై 30 న ఈ చిత్రం రిలీజ‌వుతోంది. అయితే దీంతో రామ్ చ‌ర‌ణ్ క‌మిట్ మెంట్ పూర్త‌యిన‌ట్టు కాదు. మ‌రోసారి దాన‌య్య తో సినిమా చేయ‌డానికి చెర్రీతో డీల్ కుదిరింద‌ట‌.

త్రివిక్ర‌మ్- చ‌ర‌ణ్ కాంబినేష‌న్ లో ఓ సినిమా ఉంటుంద‌ని కొద్ది రోజులుగా వార్తలొస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్ట్ ను నిర్మించే అవకాశం దాన‌య్య‌కే క‌ల్పించిన‌ట్లు స‌మాచారం. త్రివిక్ర‌మ్  హోం బ్యాన‌ర్ హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్ తో  భాగ‌స్వామ్యంలో ఈచిత్రం నిర్మించ‌నున్నార‌ని అంటున్నారు. ఇక్కడ దాన‌య్య‌ను పార్ట‌ర‌న్ గా చేయ‌డంలో చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తున్న‌ట్లు తెలుస్తోంది. గ‌తంలో దాన‌య్య‌తో చేసిన బ్రూస్లీ- విన‌య విధేయ రామ న‌ష్టాల‌ను భ‌ర్తీ చేసేందుకే చ‌ర‌ణ్ ఇలా ఆయ‌న‌కు ఛాన్స్ ఇస్తున్నార‌న్న మాట‌ వినిపిస్తోంది. మ‌రి ఇందులో వాస్తవం ఎంత అన్న‌ది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.
Tags:    

Similar News